సైనికుని త్యాగం
By Sitadevi Padala
దహించే దారి అని తెలిసి కూడా దాని వైపు చేరే ధైర్యం
దాగిఉన్న శత్రువు దరిలో ఉన్నా కూడా ఎదురు నిలిచే గర్వం
ప్రాణం పోసి పెంచుకున్న అమ్మదా గొప్పతనం
ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారిదా త్యాగం
స్నేహానికి చేసే సాయం, బంధానికి పెట్టే భాధ్యత
దేశానికి చేసే త్యాగం ముందు చిన్నవే కదా
అసలైన జాతీయ పతాక కాషాయ వర్ణ ప్రతిబింబం మీరే కదా
By Sitadevi Padala

Comments