వందే'మా'తరం
- Hashtag Kalakar
- Nov 19, 2022
- 1 min read
By Bharathi
అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. అమ్మను సంతోష పెట్టి రుణం తీర్చుకుందాం అని అనుకుంటే ఆమె.
సంతోషం కూడా మన విజయం లోనే ఉంటుంది.
ఎందరో వాళ్ళ జీవితాలని, అందులో సంతోషాలు ఉంటాయన్న సంగతి కూడా మర్చిపోయి ,
ఎటువంటి గుర్తింపు ఆశించకుండా,
తన, తన వాళ్ళ ఆత్మగౌరవాన్ని నిలబెట్టడం కోసం అన్ని త్యజించిన వారు ఎందరో.
ఇలాగ అయినా, తన తల్లి ఋణం కొంతైనా తీర్చుకున్న వారము అవుతామనే ఆత్మసంతృప్తి వాళ్లది.
కానీ మనం ఆ శిఖరాగ్రం లో ఉన్న కొంతమందికి మాత్రమే గుర్తిస్తున్నాం.
కానీ వారు ఆ శిఖరాగ్రానికి చేరడానికి మెట్ల గా నిలిచిన వారిని మర్చిపోవడం ఎంతవరకు సమంజసం.
శిఖరాగ్రం లో ఉన్నవారు ఎన్నో మాటలు చెప్పొచ్చు కానీ ఆ మాటలు విని విలువనిచ్చి ఆచరించి వాళ్ళ మాటకు విలువ పెంచిన వారిని ఆదమరిస్తే ఎలా ?
వారు ఎటువంటి గౌరవాన్ని గాని గుర్తింపుని గాని నుండి కోరుకోవడం లేదు.
వాలు కోరుకునేది ఒక్కటే తాము ఏ తల్లి ఒడిలో సేద తీరేలా
ఆ తల్లి ఒడి గుండె ఎల్లప్పుడూ చల్లగా ఉండేలా చూడడం లోనే వాళ్ళ ఆత్మసంతృప్తి ఉంది.
అందుకే వాళ్లు సగర్వంగా ఎలుగుఎత్తి చాటుతున్నారు. వందే 'మా' తరం అని.
వాళ్లు, వాళ్ల బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి సగర్వంగా ఎలుగుఎత్తి చాటుకున్న ఆ నినాదాన్ని వారసత్వంగా ఇచ్చిన తీసుకున్న 'ఈ' తరం
విద్య అంటే భవిష్యత్తులో తాను తన వాళ్ళు సుఖంగా ఉండడానికి డబ్బులు సంపాదించే ఇరుకు అక్షరాలుగా కాకుండా,
"విద్య అంటే రోజు ఏదో ఒక కొత్త విషయం తెలుసుకునే జ్ఞాననిధి.
జీవితం మన ముందు ఉంచే అచ్చెరువు లను ఛేదించ, కనిపించకుండా మనలోనే ఉండే అంబులపొది."
అది ఇచ్చిన ఆత్మస్థైర్యంతో
కలిసికట్టుగా మనం ఉన్న
మనల్ని కలవకుండా చేస్తున్న,
మన వాళ్ళు ఎదురుగా బాధపడుతున్నా
ప్రేమగా అక్కున చేర్చుకున లేక పోతున్నా,
మనింట్లోనే మనల్ని, పరాయివాళ్ళని చేస్తున్న
ఎవరికి వారే ఒంటరిగా పోరాడేలా చేస్తున్న
ఈ బయో వార్స్ ని, విజయవంతంగా ఎదిరించి
మనం కూడా ఎలుగెత్తి చాటుదాం.
వందే 'మా' తరం అని.
By Bharathi

Comments