top of page

రక్తాలయాలు

By Dr. Samudrala Priskilla


పహాల్గాం..మణిపూర్

ఆంధ్ర ప్రదేశ్ ఉత్తర ప్రాంతం 

కేరళ అశుభ నగర్ లు 

రక్తాలయాలు.. కామ్యాలయాలు..

ఏదైతేనేం మతపర వైషమ్యాలు 

పొంగే నెత్తుటి గంగాగోదారులు.. 


మహిళలపై బిడ్డలపై 

సైన్యం పై హైన్యం పై 

శాస్త్రం పై సమ్మతి పై 

మూకల దాడుల

హింసా కాండలు

నడిరోడ్లపై నగ్నగమనాలు….

 

ప్రాదర్శక పట్టే వల్లకాడట 

పాదిర్ల ప్రాణం తీయునట 

దళితుని చేతులు నరుకుట 

తాగిన మైకపు కాల్మడినట 


హిందువా?

ముస్లిం వా?

క్రైస్తవుడివా?

కన్నార్పితే రెప్పపాటున 

మతోగ్రవాదుల బుల్లెట్తూట్లు

భయం గుప్పిట్లో గుండెలు 

భగభగ మండే మాట్లు… 


ఆధునిక శతాబ్దాన అట్టుడికిన భారతావనికి 

ఆ యుయెన్నెఫ్సిసిలు ఈ హెచ్చార్సీలు 

ఓ అంతర్జాతీయ మత స్వేచ్ఛా నివేదికలు

ఆ తరిగిన మానవీయత పెరిగిన మంకువీయత

లౌకికమొక బూతయ్యేనే! 

మతమొక నీతయ్యేనే!!


ఉండాలిక 

సౌఖ్యం ఐక్యం

సహనం శాంతి 

సముచితమౌచితి 

సుహితం మంచి 

దేశపు రీతి! దేశపు నీతి!!

                     

        డా. సముద్రాల ప్రిస్కిల్ల,   తెలుగు శాఖ 

      ప్రభుత్వ కళాశాల (అ),   రాజమహేంద్రి


By Dr. Samudrala Priskilla


Recent Posts

See All
Dumb or In Love

By Kavya Mehulkumar Mehta are poets dumb — or just in love? to the world, they may seem dumb, but for them, love is inevitable. poems are reminders of love that can’t be forgotten, shan’t be forgotten

 
 
 
A Future So Azure

By Inayah Fathima Faeez Tomorrow looms unsure, muffled by the deep Thumbs twiddling, barriers never-ending, failure and nothing to reap At the shore lie the choices, imposing, leading to journeys impo

 
 
 
Letting Go In Layers

By Inayah Fathima Faeez Some part of us is cold and shrivelled, In a body of seemingly endless depth. Some part of us is heavy and dishevelled, Misery filling an unending breadth.  Some part of us is

 
 
 

156 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
M guptha M guptha
M guptha M guptha
Dec 30, 2025
Rated 5 out of 5 stars.

Good

Like

Rated 5 out of 5 stars.

Excellent

Like

Rated 5 out of 5 stars.

Excellent

Like

Rated 5 out of 5 stars.

Excellent

Like

Rated 5 out of 5 stars.

Good 👍

Like
bottom of page