మాధ్యాసియాలో నదియా…!!
- Hashtag Kalakar
- Dec 3, 2025
- 1 min read
By Dr. Samudrala Priskilla
నదియా అంజుమాన్
నెత్తుటేరుల్లో రక్తగంధిని చూసావా !
మాజీ మంత్రో రహస్తంత్రో జగత్కంత్రో…
సల్తానత్ రక్తిమ కుంకుమ కజకిస్థాన్ దారుల్లో
ఆపరేషన్ సిందూర్ లా కెంపెక్కింది కదా!
సిగ్గూ.. సిగ్గూ.. నినాదవాద రొదరవాలు
కనత్బెకోవా పరికంపపు జడుపులు కిర్గిస్థాన్ వీధుల్లో
ఆపరేషన్ కగార్ లా నిక్కెక్కింది కదా!
సాంస్కృతిక బంధనం
సామాజిక నిబంధనం
వధువు నిర్బంధనం
స్త్రీ బతుకు పై పేర్చిన చితులే అత్యాచారం కాదా!
తల్లి ఒడిలో నిప్పులు కక్కుతున్న క్రిమినలైజేషన్లు
హక్కులు లేని మహిళల నిశ్శబ్ద శోకాలు
నోట్లో కుక్కిన గుడ్డల్లా భయం గుప్పెట్లో ప్రాణాలు
మధ్యాసియాలో ముట్టరాని రక్తస్రావాలు కావా!
ఓ నదియా అంజుమాన్
స్తీర్విస్త్రీ గుండెల్లో బిబిషికలెప్పుడైన విన్నావా!
చట్టాలూ స్త్రీలైతే శైశ్నిక వేదింపులు తప్పవేమో..
అవునంటే పంటి గాట్లు.
కాదంటే కత్తి పోట్లు
ఒకవైపు
“బోల్డ్ బ్యూటీ ఆనంద హేల” బాగరుల వర్ణన
మరో వైపు
“ఆమె మరణం దేశానికి బాధ” అధికారుల అభివర్ణన
ఇంకోవైపు
“సీసీటీవీలు అనిమేషలే” తెంపరుల వివరణ
నదియా అంజుమాన్ !
అకళంక సమాజం సాక్షిగా చెప్తావా!!
జాతి భేదం కూడా లేదని…
చట్టం ముందు అందరూ సమానమేనని…
సమతా మమతల మానవత్వమేనని..
By Dr. Samudrala Priskilla

Awesome
Nice 👍
Excellent
Excellent
Super