ప్రపంచం
By Srinivas Putta
పరుగెడుతుంది ప్రపంచం
వేగాన్ని పుంజుకొని,
మేఘాల్ని దాటుకొని,
ఉన్న భూమిని పాడుచేస్తు.
కొత్త లోకం జాడచూస్తు,
పరిగెడుతుంది ప్రపంచం
కట్టడాల ఎత్తులు పెంచుకుంటూ,
పట్టణాల పరిధులు మార్చుకుంటూ,
వాయు వేగాన్ని అందుకుంటూ,
ఆయు ప్రమాణాలను తుంచుకుంటూ,
పరిగెడుతుంది ప్రపంచం
కంచెలెన్నో పాతుకుంటూ,
ఆయుధాలు పెంచుకుంటూ,
విషపు కొరలు చాచుకుంటూ,
ఒకరినొకరు కాల్చుకుంటూ,
పరిగెడుతుంది ప్రపంచం
అభివృద్ధిని సాధిస్తూ,
అంతరిక్షం చేధిస్తూ,
అణువణువు శోధిస్తూ,
అనునిత్యం శోకిస్తూ,
పరిగెడుతుంది ప్రపంచం
చీకటిని చీలుస్తూ,
విలువలని పాతేస్తూ
మురికిని పారిస్తూ,
కాలుష్యాన్ని పీలుస్తూ,
పరిగెడుతుంది ప్రపంచం
దాహం తీర్చని డబ్బు వెనక,
రేయనక పగలనక,
ఎండనక వాననక,
రేపటి అంధకారాన్ని కానక,
మనిషిలో మనిషిని చూసిననాడు
మట్టిని మాతృమూర్తిగా తలిచిననాడు,
మనలో చెడులు తోలిగిననాడు,
ఆగును కదరా అందరి పరుగులు.
తొలగును అపుడే అందరి వ్యధలు,
కంచికి చేరును అందరి కథలు.
By Srinivas Putta

Comments