ప్రతి అడుగుకీ ఓ తోడు...అవశ్యమైనది
By Nanubolu Rajasekhar
మనిషికి మానవత్వం తోడైతే...
ఆ మనిషి వ్యక్తిత్వం ఉత్తమమైనది.
మనిషికి క్రమశిక్షణ తోడైతే...
ఆ మనిషి జీవితం సంతులితమైనది.
కుటుంబానికి ఐక్యత తోడైతే...
ఆ కుటుంబం ఆదర్శవంతమైనది.
వంశానికి కీర్తి తోడైతే...
ఆ వంశ చరిత్ర ఘనమైనది.
భక్తికి ఆత్మశుద్ధి తోడైతే...
ఆ భక్తి భగవంతునికి ప్రియమైనది.
శిష్యుడికి సద్గురువు తోడైతే...
ఆ శిష్యుడి భవిష్యత్తు దిగ్విజయమైనది.
విద్యాలయాలకు సమాజ సేవ తోడైతే...
ఆ విద్యాలయాల ఆశయం శ్రేష్టమైనది.
విద్యార్థి విద్యకు వినయం తోడైతే...
ఆ విద్యార్థి విద్య పరిపూర్ణమైనది.
విద్యార్థులకు గురువుల వాక్క తోడైతే...
ఆ విద్యార్థుల మేదస్సు సృజనాత్మకమైనది.
బిడ్డలకు తల్లిదండ్రుల అనుభవం తోడైతే...
ఆ బిడ్డల భవిష్యత్తు ఉజ్వలమైనది.
సమాజానికి విలువలు తోడైతే...
ఆ సమాజం సద్గుణసంపన్నమైనది.
నాయకత్వానికి ప్రజాసేవ తోడైతే...
ఆ నాయకత్వం మార్గదర్శమైనది.
పరిపాలనకు ప్రజా క్షేమం తోడైతే...
ఆ పరిపాలన ప్రజారంజకమైనది.
దేశానికి ప్రజా ఐక్యత తోడైతే...
ఆ దేశం శక్తివంతమైనది.
స్నేహానికి నమ్మకం తోడైతే...
ఆ స్నేహం పటిష్టమైనది.
ప్రకృతికి మానవ సంరక్షణ తోడైతే...
ఆ ప్రకృతితో జీవనం మనోహరమైనది.
ఉద్యోగికి నిబద్ధత తోడైతే...
ఆ ఉద్యోగి వృత్తిపథం నిశ్చలమైనది.
భార్యాభర్తలు ఒకరికొకరు తోడైతే...
ఆ భార్యాభర్తల దాంపత్య జీవితం మధురమైనది.
జీవితానికి దారి చూపే తోడు లేకపోతే......
ఆ జీవితం అసంపూర్ణమైనది.
అందుకే జీవిత పయనంలో....
ప్రతి అడుగుకీ భుజం తట్టే ఓ తోడు...అవశ్యమైనది.
By Nanubolu Rajasekhar

Inspiring article
👌👌Inspirational Article👌👌
Very motivational artic
Very nice poetry
తోడు అనే దానిని అన్ని కోణాలలో వివరించారు. ఇదొక కొత్త సాహిత్య ప్రయోగం అనిపించింది.