ప్రకృతి
By Sitadevi Padala
దేవుడు ఇచ్చిన వరమా
ప్రపంచ ప్రధమ అశ్చర్యమా
అలలా ఉప్పొంగే సముద్రమా
ఇలలో స్వర్గమా ఇంపైన స్వరమా
పచ్చని చిగురుల పసితనమా
ప్రవహించే నదుల ప్రావారమా
విరుల వాసనల విడ్డూరమా
వాన చినుకుల వయ్యారమా
పూల పరిమళాల ప్రవాహమా
పక్షుల కిలకిల రావమా
కమ్మని కోయిల స్వరమా
ఎర్రని కాంతి కిరణమా
చల్లని వెన్నెల చంద్రమా
వ్యవసాయ వీరుల వర్ణభరిత వాసమా
వసించు ప్రజల వేడుకల వినోదమా
విజ్ఞాన శాస్త్ర విద్యలో మానవ నేస్తమా
అమ్మ ప్రేమ ను తలపించే కమ్మని ఫలమా
ఆప్యాయతతో ఆసరాన్నిచ్చే ఆతిథ్యమా
హద్దులు లేని ఆప్యాయతకు అమ్మే అందం
అంతులేని ఆనందానికి ప్రకృతి తోనే బంధం
ప్రకృతే మన చుట్టూ ఉండే చక్కని నేస్తం
ప్రకృతిని కాపాడటమే మనందరి కర్తవ్యం
By Sitadevi Padala

Comments