నేను మనిషిని!
Updated: Dec 2, 2022
By Hemanth Adithyah
కొంత మందికి నేను పరువుని,
ఇంకొంత మందికి నేను అరువుని,
మరి కొంత మందికి వారి ఆటలో నేనో పావుని,
ఇంకొంత మందికి పనిని...
మరి ఎవరికి నేను మనిషిని?
ఓ మనిషి ‘మనిషిని’ అని గుర్తుచేసుకునే దౌర్భాగ్యం...
మనిషిలో మనిషిని తప్ప అవసరాన్ని మాత్రమే చూసే అజ్ఞానం..
ఈ రెంటికి మధ్య నలిగిపోయే జీవితాలెన్నో!
మనిషిలో మనిషిని మాత్రమే చూడగలిగి వాడే నిజమైన మనిషి!
By Hemanth Adithyah

Comments