నాన్న
By Bharathi
"హలో.... హలో.... మీరు సూర్య వాళ్ళ ఫాదర్ ఏనా మాట్లాడుతుంది." అని మర్యాదపూర్వకంగా అడిగిన అవతలి వాళ్ళ గొంతు విని
'అవునండి,' అని అంతే మర్యాదగా సమాధానం చెప్పి 'మీరు ఎవరు ?' అని ప్రశ్నించాడు శరత్.
'నేను మీ అబ్బాయి క్లాస్ టీచర్ సర్' అని తనని తాను పరిచయం చేసుకున్నారు ఆమె.
'ఓహ్... నమస్తే టీచర్' చెప్పండి అని మర్యాదపూర్వకంగా అడిగాడు శరత్.
మీ బాబు రెండు రోజుల నుండి డల్ గా ఉంటున్నాడు అండి. ఈరోజు మరీ డల్ గా అనిపించి చెక్ చేస్తే టెంపరేచర్ కూడా ఉంది.
మీ మిస్సెస్ కి ఫోన్ చేస్తాను, అంటే వద్దు ఇప్పుడు మా మమ్మీ రెస్ట్ తీసుకునే టైం డిస్టర్బ్ చేయొద్దు అని ఏడుస్తూ ఫోన్ చేయనివ్వడం లేదు.
కానీ బాబుకి జ్వరం కొంచెం ఎక్కువగా ఉన్నది అందుకే నేను పక్కకు వచ్చి మీకు ఫోన్ చేశాను కాస్త మీరు త్వరగా వచ్చి బాబుని తీసుకువెళ్తారా అని అడిగారు ఆమె.
'సూర్యకి జ్వరమా? ఓ మై గాడ్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను మేడం. నేను వచ్చేంతవరకు కాస్త మా బాబుని జాగ్రత్తగా చూసుకుంటూ చూసుకోండి.' అని కంగారుగా చెప్పి ఆఫీసు నుంచి బయలుదేరేడు శరత్.
ఓ హాఫ్ ఎన్ అవర్ లో స్కూలు ముందు తన కార్ ఆపి లోపలికి వెళ్ళాడు.
రిసెప్షన్లో అతను ఎందుకు వచ్చిన సంగతి చెప్పగానే ఆమె ఆ టీచర్ కి ఇన్ఫర్మ్ చేయడంతో
టీచర్ సూర్య ని పట్టుకొని రిసెప్షన్ కి వచ్చారు.
శరత్ ని దూరం నుండే చూసి భయపడి మళ్లీ వెనక్కి క్లాసులోకి వెళ్ళిపోదాం అనుకున్నాడు సూర్య, కానీ తన చెయ్యి టీచర్ చేతిలో ఉండడం గమనించి భయపడుతూనే శరత్ వైపు అడుగులు వేశాడు.
సూర్యతో వచ్చిన టీచర్ని చూసి తనని తాను పరిచయం చేసుకున్నాడు శరత్.
అప్పటివరకు బాబుని జాగ్రత్తగా చూసుకున్నందుకు టీచర్ కి థాంక్స్ చెప్పి సూర్యుని తీసుకొని స్కూల్ నుండి బయటికి తీసుకువచ్చి కార్లో కూర్చోబెట్టి ఇంటికి బయలుదేరారు.
మధ్యలో ఒకచోట ఓ పక్కగా కారు ఆపి సూర్య నుదుటి మీద చెయ్యి వెయ్యబోయాడు.
అది చూసి అతను తన్ని కొట్టబోతున్నాడేమో అని భయపడి కారు విండో వైపు ఒరుగుతూ, భయంతో చిన్నగా ఏడుస్తూ....
'ఐ యాం సారీ టీచర్ మీకు ఫోన్ చేస్తారని అనుకోలేదు.'
ఇక పై జ్వరం వస్తే టీచర్ కి కూడా తెలియకుండా జాగ్రత్త పడతాను.
'ఇప్పుడు మీ పనిని డిస్టర్బ్ చేసినందుకు సారీ' అని అమాయకంగా చెప్తున్న సూర్య మాటలు అర్థం కాక బాబునే చూస్తూ వాటర్ బాటిల్ సూర్య చేతికి ఇచ్చాడు శరత్.
ఆ బాటిల్ లో వాటర్ తాగి కిందకు దించి ఆ బాటిల్నే చూస్తూ అడగాలా వద్దా అన్న సంశయంతోనే 'మీరు ఇప్పుడు నన్ను మమ్మీ ని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించేస్తారా ?' అని తల పైకి ఎత్తకుండానే అడిగాడు సూర్య.
'ఎందుకు అని ఆశ్చర్యం కూడిన గొంతుతో', కాస్త గట్టిగానే అడిగాడు శరత్.
శరత్ గొంతులో తీవ్రతకి బెదిరిపోయిన సూర్య ఒక్కసారిగా తలపై ఎత్తి అతన్ని చూశాడు.
సూర్య కళ్ళల్లో బెదురుని చూసి తనని తాను తమాయించుకొని, ఆ చిన్నారి చెంపని ప్రేమగా నిమృతు తన ఒళ్ళోకి తీసుకొని "ఎందుకలా అనుకుంటున్నావు" అని లాలనగా అడిగాడు.
ఇప్పటివరకు ఎవరూ కూడా తనని అంత ప్రేమగా చేరదీయకపోవడంతో ఒక్కసారిగా మెడ చుట్టూ చేతులు వేసి ఏడుస్తూ,
అమ్మమ్మ చెప్పింది నేను మమ్మీ బొజ్జలో ఉన్నప్పుడు ఏవో కాంప్లికేషన్స్ వచ్చాయని, నేను బయటికి వస్తే హెల్త్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందని డాక్టర్ చెప్పారట.
ఆ మాటలు విని డాడీ నన్ను మమ్మీ పొట్టలో నుంచి బయటికి రానివ్వకూడదని చెప్తే,
మమ్మీ అందుకు ఒప్పుకోకపోవడంతో, గొడవపడి నన్ను, మమ్మీని వదిలేసి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు మీ దగ్గరికి వచ్చే ముందు నన్ను గుడ్ బాయ్ లాగా మిమ్మల్ని విసిగించకుండా నా పనులు నేను చేసుకుని బుద్ధిగా చదువుకోవాలని చెప్పారు.
కానీ నాకు ఈ జ్వరం ఎలా వచ్చిందో తెలియదు ప్లీజ్ నన్ను అమ్మమ్మ దగ్గర వదిలేస్తే వదిలేయండి. కానీ, మమ్మీని ఇక్కడే ఉండునివ్వండి మీతో పాటు ఎందుకంటే ఇందుకు మునుపు మమ్మీ నన్ను స్కూల్ కి తీసుకెళ్లిన, ఆడించడానికి పార్క్కి తీసుకువెళ్లిన, అక్కడ కొంతమందిని చూసి భయపడేది, ఒక్కొక్కసారి నేను పడుకున్నాను అనుకోని ఏడుస్తూ ఉండేది.
కానీ మీ దగ్గరికి వచ్చాక మమ్మీ కళ్ళల్లో నేను భయం చూడలేదు. అందుకే ప్లీజ్ అని అమాయకంగా రిక్వెస్ట్ చేస్తున్న సూర్యుని చూసి,
అంత చిన్న వయసులోనే వాడికి తన తల్లి పట్ల ఉన్న ప్రేమ బాధ్యతని చూసి కళ్ళలో నీళ్లు తిరిగాయి, వాటిని బయటికి రానీయకుండా ఆపి సూర్య కళల్లోకి చూస్తూ "సంతోషంలో తప్పితే సమస్య వస్తే పారిపోయే ఓ మూర్ఖుడు చేసిన పని వలన ఈ పసి హృదయం ఎంత ఆవేదనకు గురి అయ్యింది." అని మనసులోనే అనుకుని బాబుని గట్టిగా తన గుండెలకు హత్తుకుని,
మమ్మీనే కాదు సూర్యని కూడా ఎప్పుడు వదలడు ఈ శరత్ ఎందుకంటే సూర్య శరత్ ఫ్రెండ్స్ కదా అని తన చేతిని ముందుకు చాప్పాడు.
ముందుకు చాపిన శరత్ చేతి వైపు అతని వైపు మార్చి మార్చి చూస్తూ నిజంగా అంటూ ఆనందంతో నవ్వుతూ తన చేతిని అందించాడు సూర్య.
తనదగ్గరికివచ్చినఈరెండునెలల్లోమొదటిసారిసూర్యపెదవులపైనచిరునవ్వుతోవికసించినఆముఖంచూసిఎప్పటికీఆచిరునవ్వునిమాయమవ్వనివ్వననితనకితానేవాగ్దానంచేసుకున్నాడుశరత్.
By Bharathi

Comments