చిన్నమాట...పెద్ద ప్రభావం
By Nanubolu Rajasekhar
చిన్నమాట…
జీవితంపై పెద్ద ప్రభావాన్నే చూపించగలదు.
చిన్నమాట…
రెండువైపులా పదునెక్కిన కత్తిలా...
మంచీ చేయగలదు, చెడూ చేయగలదు.
చిన్నమాట…
విలువను పెంచగలదు,
ఆ విలువనే తగ్గించనూగలదు.
చిన్నమాట…
స్నేహితులను దగ్గర చేయగలదు,
ఆ స్నేహితుల్నే దూరమూ చేయగలదు.
చిన్నమాట…
వ్యక్తిత్వాన్ని ఆకాశానికి ఎత్తగలదు,
ఆ వ్యక్తిత్వాన్నే పాతాళానికి దించనూగలదు.
చిన్నమాట…
బంధాలను ప్రేమతో కలపగలదు,
ఆ బంధాల్నే ద్వేషంతో విడదీయనూగలదు.
చిన్నమాట…
విజయాన్ని అందించగలదు,
ఆ విజయాన్నే చేజార్చునూగలదు.
చిన్న మాట...
ప్రశాంతతను సృష్టించగలదు,
ఆ ప్రశాంతతనే ఉద్రిక్తతగా మార్చనూగలదు.
చిన్నమాట...
సత్కారాల్ని చేయించగలదు,
ఆ సత్కారాలనే ఆపించనూగలదు.
చిన్నమాట...
భవిష్యత్తును వెలిగించగలదు,
ఆ భవిష్యత్తునే ఆర్పివేయనూగలదు.
చిన్నమాట...
నాయకుడిగా నిలబెట్టగలదు,
ఆ నాయకుడినే పడగొట్టనూగలదు.
చిన్నమాట...
రాజ్యాన్ని నిర్మించగలదు,
ఆ రాజ్యాన్నే కూల్చనూగలదు.
మాట్లాడే నాలుక అదుపు తప్పితే…
చిన్నమాటే పెద్ద మాటై,
పెద్ద శిక్షల్నే వేయించగలదు.
అందుకే,
మాటను పొదుపుగా...
భాషను అదుపుగా వాడాలి.
By Nanubolu Rajasekhar

Good
Amazing work
Amazing work
This poetry is very motivational
Very nice