top of page

ఓ నిమిషం

Oct 29, 2022
1 min read

By D. Bharathi


ఆఫీసు నుండి ఓ నిమిషం లేటుగా బయటకు వస్తే అప్పుడే మన కళ్ళ ముందే మనం ఎక్కవలసిన బస్సు బయలుదేరి వెళ్ళిపోతే నిరాశగా దానివైపే చూస్తూ చచ్చి చెడి మరో బస్సు కోసం ఎదురు చూడడమో లేక ఆలస్యం అవుతుందని షేర్ ఆటోలోనో ఓ అరగంట లేటుగా ఇల్లు చేరి,

ఇంట్లో మనకోసం ఎదురు చూస్తున్న పనుల కాల పట్టిక అదేనండి టైం టేబుల్ ముందుకు జరగడంతో, కాలంతో పోటీపడి వాటిని సమతుల్యం చేయాలనుకున్న, శరీరం మరియు మానసిక అలసటతో వాటిని సరి చేయలేక, ఆ ఒత్తిడిని ఎవరిమీద చూపించాలో తెలియక ఒక్కొక్కసారి చేస్తున్న పనిలో చూపి, మళ్లీ పని భారం పెంచుకొని,

ఆ ఒత్తిడి కుటుంబ వాతావరణం పై పడి, తిరిగి అది అంతా కొంచెం సద్దుమనిగి, నిద్రపోదాం అనుకున్నా మనసు ఇంకా ఏదో కోరుకోవడంతో, సెల్ఫోన్లో ఏవో వీడియోలు చూస్తూ వాటిలో మన అభిరుచిని దగ్గరగా ఉన్నవి చూసి నప్పుడు, అందులో చేసిన వారి కన్నా, మరింత బాగా ఆ ప్రతిభను నువ్వు చూపగలవు అని మనసు అంటే అవునని ఓ క్షణం అనుకున్నా,

మరుక్షణమే అంత సమయం మన దగ్గర ఎక్కడ ఉంది అని దాని నోరు నొక్కేయాలని చూస్తే,

"మన కాలాన్ని మరొకరి దగ్గర తాకట్టు పెట్టుకోవడం కన్నా,

దానిని పెట్టుబడిగా పెట్టి నీ ప్రతిభను మలుచుకోవడం మిన్న"





అని మనసు అప్పుడప్పుడు గొంతు ఎత్తాలని చూసినా, మన అవసరాలు దాని నోరుని నొక్కేస్తూ,


ఇవన్నీ జరిగేవి కావులే అని మనసుకి సర్ది చెప్పుకొని, ఓ నిట్టూర్పు విడిచి


నిద్రపోవాలి అనుకున్న కాలాన్ని కుదించి ఈ ఉరుకుల, పరుగులలో ఏదో కొద్దిగా రిలాక్స్ అవ్వాలని అనుకుంటే, ఈ పిచ్చి మనసు ఏవేవో గుర్తు చేస్తూ ఉంది. ఇంతలో నిద్ర దేవి పిలవడంతో ఇంకా అన్ని మరిచి దాని ఒడిలోకి చేరుకుంటాం.


మళ్లీ మరో ఉదయానికి స్వాగతం పలుకుతూ,


మనల్ని మనకు దూరం చేస్తూ

ఇంకా ఏదో కావాలని కోరుకుంటూ

ప్రతిరోజు మన గమ్యాన్ని మార్చుకుంటూ

ఉన్నచోటే భద్రత అనుకొని

మన పెరుగుదలకు అవకాశం ఉన్నచోట

అభద్రతగా ఉంటుందేమో అని తలచి

కనీసం మనల్ని మనం మార్చుకునే ప్రయత్నం కూడా మరిచి

ఉరుకుల పరుగులతో కాలాన్ని అందుకోవాలని

మరో ఉదయానికి ఆహ్వానం పలుకుతున్నాము

ఓ నిమిషం ఆలస్యంగా....


By D. Bharathi





Recent Posts

See All
Kannikonna

By Deepa Santosh കേരളത്തിന്റെ ഔദ്യോഗിക പുഷ്പമായ കണിക്കൊന്നയുടെ ദർശനവും സ്പർശനവും സൂക്ഷ്മമായപ്പോൾ അവളിൽ അന്തർലീനമായ നിരവധി ഭാവങ്ങൾ ചിറകുവിടർത്തി... നവനീതചോരന്റെ നറുപുഷ്പവും നവരസങ്ങളും കാർമ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page