ఎప్పుడో...
By Sitadevi Padala
అమ్మ ప్రేమను కురిపిస్తావా లేక ఆ ప్రేమనే మరిపిస్తావా
నాన్నలా నడిపిస్తావా లేక నా నడకకు నీడవుతావా
నా మౌనానికి మాటవుతావా లేక మనసును మీటే పాటవుతావా
నా అసయాలలో అడుగవుతావా లేక విజయానికే బాటవుతావా
మాటలతో మాయ చేసే కన్నయ్యవా లేక బాధ్యతలు మోసే రామయ్యవా
ప్రేమ ధనువు విరిచేదెప్పుడు ఈ సీత మనసు చేరేదెప్పుడు
మొబ్బుల మధ్య తొంగి చూసే ఆకాశానికి నీ వెలుగందేదెప్పుడు
ఊహించే హృదయం హద్దులు వీడి నీతో జతగా విహరించేదెప్పుడు
నీ చిరునవ్వు నా కన్నీటిని తుడవాలి
నీ చూపు నా కోపాన్ని ఆపాలి
ఓదార్చే నీ మాట నా బలమవ్వాలి
నీ ఆనందం నా బాధ్యత కావాలి
నా విజయంలో నువు సగమవ్వాలి
కష్టాల్లో ఇద్దరమొక్కటవ్వాలి
By Sitadevi Padala

Comments