ఆ కళ్ళు
By Kruthika Mantha
పాత ఆకాశం కొత్త తారలు
కొత్తగా కనిపించే పాత జాబిలి
నిండు వెన్నెల
ఇన్ని తోడుగా ఉన్నా
కొత్త ఊరేమో అంతా కొత్త కొత్తగా అనిపించింది..
ఆ సమయంలో నాతో స్నేహం చేసాయి ఆ కళ్ళు
తెలిసిన వాళ్ళకోసం వెతుకుతున్న నా కళ్ళకి
అవి అలిసి పోయినవేల కలిసిన ఆ కళ్ళు
అనుకోకుండా మళ్ళీ కలిసాయి
మళ్ళీ మళ్ళీ కలిసాయి
ఆపై వెతుకులాటలో అలిసిపోయిన వేళ
మళ్ళీ ఆనందంగా కలిసాయి
అందరిలాగే ఎన్నో కబుర్లు చెప్తున్నాయి అనను
కానీ…
ఏదో మాట్లాడుతున్నాయి
బహుశా అది అర్థం అయ్యేంత పరిచయం ఉండి ఉంటే
బాగున్ననిపించింది..
ఆ తర్వాత పాత పనులలో, కొత్త పరిచయాలతో
ఆ కళ్ళు పెద్దగా కనిపించలేదు
తర్వాత రోజు పనులలో తీరిక దొరకనేలేదు
ఇంక వెళ్ళిపతున్నాననగా
ఆ కళ్ళని ఒకసారి కలిసి వెళ్ళాలనిపించింది
వెతికాను
ఎక్కడా దొరకలేదు
బహుశా పనులలో అలిసి పడుకుని ఉంటాయి
అనుకుని
ఇంక వెళ్ళిపోయాను
కొన్ని మధురస్మృతులని నా మనసుకి మిగిల్చిన ఆ మనోహరమైన కళ్ళని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటూ…
By Kruthika Mantha

Comments