By Perika Manovikas
తల్లి పేగు తెంచుకుని జన్మించిన ఆ క్షణం.
మరువలేను మాయమైన తల్లి ప్రేమ మరుక్షణం
తెలియలేదే ఎటువైపో నే నడిచే నా గమ్యం ..
కాలమే ఎదురొచ్చి బదులిచ్చెను నాకు సమాదానం
పసిబిడ్డనని చూడలేక తల్లడిల్లె ఓ తల్లి ప్రాణం
మరువలేను ఈ జన్మకు నువ్విచ్చిన ప్రేమ రుణం
తెలియలేదే నీకెన్నడు తల్లిప్రేమ ఈశ్వర
లోకమేలె లోకమాతకు నే ముద్దు బిడ్డనాయెరా
By Perika Manovikas
Comments