Telugu-Earth(BhooMatha) thinking about her situation
Updated: Sep 3, 2025
By Padmavathi Sirangu
నేనొక బీడు బారిన భూమిని
నా ముందు ఎన్నో జీవులు కాలగర్భంలో కలిసిపోయాయి,
అందమైన పువ్వులు వాడిపోయి, రాలిపోయి ,నాలో కలిసిపోయాయి.
నాలో వేడి నాకు బాగా తెలుస్తుంది, కానీ నాకు ఏ విధమైన మార్పు కానీ, తేడా కానీ,ఏమీ లేదు.
ఉన్నట్టుండి ఆకాశం నుంచి చిరు జల్లులు పడుతున్నాయి,ఎప్పుడో ఎలానో, నాలో ఉన్న చిన్నచిన్న విత్తనాలు చిగురులు తొడిగాయి ,పెద్ద పెద్ద మొక్కలు గా మారి అందమైన పువ్వులను, పండ్లను ఇస్తున్నాయి.
కానీ నేను ఏమి మాట్లాడలేను అలా ఉండటం తప్ప.
నా మీద వర్షపు నీరు చేరి చేరి, ఒక చిన్న సరస్సు ఏర్పడింది ,ఉదయం సూర్యుడు వస్తాడు అలా చూస్తూ చూస్తూ ఉంటే, అటువైపు నుంచి ఇటు వైపుగా మరల సాయంకాలానికి తిరిగి కనుమరుగు అవుతాడు.
అర్ధరాత్రి పండు వెన్నెలను వెదజల్లుతున్నాడు చంద్రుడు వస్తాడు.
ఏమిటో ఒక చిన్న విత్తనం నా లోపలి చేరి
చక్కిలిగింతలు పెడుతూ తన యొక్క వేర్లను నా లోపలికి పంపుతూ పెద్ద వృక్షం గా మారుతుంది.
ఉన్నట్టుంది పెద్దపెద్ద జడివానలు నా మీద పడతాయి నేను చాలా చల్లగా అయిపోతాను, కానీ నాకు ఏ విధమైన మార్పు కానీ, తేడా కానీ,ఏమీ లేదు.
ఒక చిన్న చీమ నా మీద అటూ ఇటూ పాకుతూ ఒక పుట్ట
చేసుకుంటుంది,అలాగే కొంత కాలం తర్వాత ఆ పుట్ట పాములకు ఆవాసం అవుతుంది,మరలా ఎక్కడినుంచో వచ్చిన చిన్న చిన్న ఎలుకలకు ఆహారంగా పాము మారిపోతుంది .
ఎక్కడినుంచో ఒక పెద్ద ఏనుగు అటూ ఇటూ నడుస్తూ వచ్చి సరస్సులో నీళ్లు తాగుతుంది
ఝుమ్మంటూ తేనెటీగలు అటు ఇటు శబ్దం చేసుకుంటూ పూలలోని మకరందము త్రాగుతాయి,ఒక పెద్ద చెట్టు ఎన్నో వేల వేల పక్షులకు ఆవాసం అవుతుంది.
,కానీ నాకు ఏ విధమైన మార్పు కానీ, తేడా కానీ,ఏమీ లేదు.
అలా కాలక్రమేణా మానవులు ఇళ్ళను నిర్మించుకుంటారు,మొక్కలను కొట్టేస్తారు జీవజాతి అంతరించి పోవడానికి సిద్ధమవుతుంది.
ఒకప్పుడు స్వచ్ఛమైన వర్షపు నీటితో ,ఒకప్పుడు సుగంధం తో నిండి ఉన్నాను,కానీ నాకు ఏ విధమైన మార్పు కానీ, తేడా కానీ,ఏమీ లేదు
పెద్ద పెద్ద ధ్వనులతో, పెద్ద పెద్ద పేలుడుతో, నాలో నిక్షిప్తమైన, నిగూఢంగా ఉన్నటువంటి ,ప్రవహిస్తున్న ఇంధనము బయటకు తీస్తారు.
తద్వారా నాలో ప్రకంపనలు వస్తాయి ,దానికి మరల మానవులు భూకంపం అంటారు, ఏమిటో ఈ వింత కానీ నాకు ఏ విధమైన మార్పు కానీ, తేడా కానీ,ఏమీ లేదు.
ఏవో చిత్తుకాగితాలు వలే ఉండే ధనం ,బంగారం నాలో దాస్తారు. అదేంటో చిత్రం, నాలో ఉన్న బంగారం ఒక రూపంలో ఒక విధంగా
ఉంటుంది ,మానవులు బంగారాన్ని వేరే వేరే మార్పులు చేసి నాలో దాస్తారు ,అదేంటో దాచిన వారికి నేను దొరకను ,ఇంకెవరు కో దొరుకుతా ను. ఏమిటో వీళ్ళ తీరు నా మీద మొక్కలు ఎంతో మధురమైన ఫలాలను ఇస్తాయి,కానీ వీరు ఏవేవో రసాయనాలు పిచికారి చేసి పండ్లను తింటూ ఉంటారు,ఏ విధమైన మార్పు కానీ, తేడా కానీ,ఏమీ లేదు.
By Padmavathi Sirangu

Comments