Story Of a Prostitute
- Hashtag Kalakar
- Sep 30, 2022
- 4 min read
By Valireddy Revanth
వెన్నల రాత్రి - సాగర తీరం - తెల్లటి ఇసుక - ఎగిసిపడే అలలు.. ఇవన్నీ ఆస్వాదిస్తున్న సమయం అది..
అలా వెన్నల వెలుగులో అందర్నీ చూస్తున్న నా కళ్ళు ఒకావిడ మీద పడ్డాయి. కురచ దుస్తులు వేసుకున్న ఆమె ఒక పిల్లాడిని ఎత్తుకొని నిద్రపుచ్చుతుంది. అతడు నిద్రపోయిన తరువాత ఒక ముసలావిడకి ఇచ్చి రోడ్డు పక్కన నిల్చుంది. ఆవిడ ఒక వ్యభిచారి అని తెలుసుకోవడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. కొంతసేపటికి బండి మీద ఒక వ్యక్తి వచ్చి ఎదో మాట్లాడి ఆవిడని తీస్కొని వెళ్ళాడు.
అది చూసి నాలో కోపం కట్టలు తెంచుకుంది. నాలో "సంఘ సంస్కర్త" అనబడే వాడుబయటకు వచ్చాడు. ఆవిడని తిట్టే వరకు అక్కడ నుండి కదిలేది లేదు అని అక్కడే కూర్చున్నా..
కొన్ని గంటల తరువాత ఆమె అక్కడకి వచ్చింది. అతను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
నేను ఆమె వెనకే వెళ్లి ఆమె చెయ్యి పట్టుకొని లాగాను.ఆమె వెనక్కి తిరగ్గానే , " ఛీ , నీకు సిగ్గు లేదా, అసలు ఆడదానివి ఏనా నువ్వు. చిన్న పిల్లాడు కూడా ఉన్నాడు. ఏదైనా పని చేస్కొని బ్రతకొచ్చుగా. నువ్వే వ్యభిచారం చేస్తూ బ్రతికితే ఇంక రేపు పొద్దున్న వాడికి ఏం నేర్పిస్తావో, వాడిని ఎలా పెంచుతావో.. ఆడ జన్మ ఎత్తినాక కొంచెం అయిన సిగ్గు ఉండాలి", అని కోపంతో అరిచాను.
ఆమె నా ఆవేశం తగ్గే వరకు మౌనంగా ఉండి, అప్పుడు మాటలాడటం మొదలు పెట్టింది..
"సారు, ఎవరు సారు వ్యభిచారి, నేను ఒక్కర్దాన్నే వ్యభిచారినా? ఏం నన్ను బండి ఏక్కించుకొని తీస్కొని వెళ్లినవాడు వ్యభిచారి కాదా? రోడ్డు మీద నన్ను చూసి ఛా ఈ అవకాశం నాకు రాలేదే అని అనుకున్న వాళ్ళు వ్యభిచారి కాదా? అంతెందుకు నా శరీరం వైపు చూసిన ప్రతి ఒక్కరూ వ్యభిచారం చేసినట్టే. మానసిక వ్యభిచారం. తమకు ఇష్టమైన హీరోయిన్నో, వ్యక్తినో ఊహించుకొని కలలో రొమాన్స్ చేస్తారు, అది వ్యభిచారమా కాదా? ఒక అమ్మాయి రోడ్డు మీద నడిస్తే కేవలం కళ్ళతో రేప్ చేసే వాళ్ళు ఎంత మందో తెలుసా! అది కూడా వ్యభిచారమే సారు. కానీ మీరు ఎవరు దాన్ని వ్యభిచారం అనరు. ఈ సమాజం దృష్టిలో ఆడది చేస్తేనే వ్యభిచారం. మగవాళ్ళు చేస్తే అది తప్పు కాదు.
ఏమన్నారు సారు మీరు, పని చేస్కొని బ్రతకొచ్చా?
భర్త చనిపోతే నెలల బిడ్డతో ఉన్నా నేను పని ఇస్తారా అని అడిగితే పక్కలోకి వస్తావా అని అడిగిన వారే ప్రతి ఒక్కరూ. అందుకే నేను రోజంతా కష్టపడి పని చేసిన తరువాత ఎవడు వచ్చి నన్ను ఏమి చేస్తాడో అని బిక్కు బిక్కుమని బ్రతికే బదులు ఈ బ్రతికే నాకు మంచిది అనిపించింది.
దయచేసి నా దగ్గర ఇది మంచి పని ఇది చెడ్డ పని అని మాట్లాడొద్దు సారు.నాకు డబ్బులు వచ్చే ఏ పని అయినా మంచి పనే. ఆ డబ్బులుతో నా బడ్డని బాగా చదివించుకుంటాను.అది చాలు సారు నా జీవితానికి. ఈ సమాజం ఏమి అనుకున్న నాకు పర్లేదు." అని ఎదురుగా ఉన్న గుడిసెలోకి వెళ్ళిపోయింది.
ఆమె చెప్పిన ఒక్కో మాట ఒక్కో చెంపదెబ్బలా అనిపించింది.ఆవిడ చెప్పిన ప్రతి మాట నిజం. అందరు ఆమెలోని ఆడదాన్ని చూస్తే నాకు అప్పుడు ఆమెలోని అమ్మ కనిపించింది. పడుకున్న తన బిడ్డను ముద్దు ఆడుతున్న ఆమెని చూసి నాకు అప్పుడు అనిపించింది,. " ఆడతనం కన్నా అమ్మతనం గొప్పది అని
I was sitting on the beach shore, after just reaching there and just being informed that I was handed a thumbs down from my friend who had to accompany me.
Then I had no choice to enjoy the nature all by myself..
In the meanwhile I observed a lady wearing a lousy dress, holding a kid on her shoulders. As soon as he fell asleep,she handed over him to an old lady. She then stood on the footpath.
It did not take me much time to realise that she is a prostitute.
In a few minutes, a man arrived , they spoke to each other and then she got on his bike and they left.
Anger raged within me. So called "social activist" in me woke. How come a lady, and that too with a kid, such shamelessly do prostitution. How can she raise her kid as a good citizen, when she herself is leading such a pathetic life.I decided to educate and reform her and thus waited for her arrival.
She arrived after a few hours, took some money from him and he left.
I went to her and started yelling,
"Do u have any shame?What kind of female are you? You are a mother of a child and you are doing such things. Can't you do another any other work? How will you raise your child if you are doing such things. What kind of message are you trying to give him. Shameless bitch". I took out all my rage on her.
She waited for me to calm down and then started talking.
"Sir, don't give me that prostitute tag ? Am I the only person to get tagged as a prostitute? That person who just left , is he not a prostitute? What about the people who felt that they have missed the chance of having sex with me? What are they called?
Every person who scanned me with their eyes, who just scared me just with their looks, they are also prostitutes sir. But it is not just physical. It is mental prostitution. But you never tag them as prostitutes. Beacuse they are men. This society use that word only for women.
What did you advice sir? Can't I do any other work? When I asked for work, this society asked for my body.
This society did not view me as a widow, they viewed me as young lady without support of a man. They did not look me as a mother. They looked me as a female.
I was fed up of living a fearful life. I dont want to raise my child in a fearful environment. Whatever I do, however I live, I wanted to give my child a beautiful life. I am not ashamed of selling my body for that.
I get money for that. And in my opinion any money which helps me to raise my child is rightful money.
I will do whatever it takes to raise my child. I don't care what this shameless society thinks. Keep your preachings with you sir". And she went into her hut.
I just experienced how a slap of words feel like. She slapped me without even touching me. It did not take much time for my rage to become guilt.
I looked towards her hut. I saw her kissing her child.
Then I felt, " There is no greater occupation than being a mother".
By Valireddy Revanth

Comments