Evarannaru Mana Desham Prapanchaniki Shunyanne Ichindhani..
By Nirati Gouthami
ఎవరన్నారు మన దేశం
ప్రపంచానికి శూన్యాన్ని
ఇచ్చిందని...
ఎవరన్నారు మన దేశం ప్రపంచానికి శూన్యాన్ని
ఇచ్చిందని...
నాడు ఆచార్య నాగార్జున లేనిదే రసాయన శాస్త్రం
పుట్టిందా?
ఆర్యభట్ట లేనిదే సున్నా కనుగొనబడిందా?
శుశ్రుత లేనిదే వైద్యం సాధ్యం అయినదా?
తెలుసుకుందామా మన దేశ శిల్ప శిఖరాల గురించి...
ఒక రాయినే శివాలయంగా మార్చగల శిల్పకళా,
బండరాళ్ళపై మానవ రూపాలను రూపొందించగల చిత్రకళ,
వందేళ్లైనా తుప్పుపట్టని ఐరన్ పిల్లర్
నిర్మించేంత శాస్త్రం,
దేవాలయాలపై గణితాన్ని చూపించేంత విజ్ఞానం.
నాడన్నారు మన దేశ స్త్రీలు వెనకబడ్డారని...
చరిత్రలో చేయలేదా రుద్రమదేవి యుద్ధం?
ఒంటరిగా ఏలలేదా ఝాన్సీ రాణి రాజ్యం?
చేయగలరా ఎవరైనా శకుంతల దేవిలా బీజ గణితం?
చేయలేదా సరోజినీ నాయుడు కాలంతో పోరాటo
శివాజీది కాదా అతిపెద్ద నావిక దళం?
అంతరిక్ష పటంలో చేర్చలేదా మన దేశాన్ని కలామ్?
అంతులేని జ్ఞానం, అమోఘమైన విజ్ఞానం, అపారమైన
శాస్త్రం,
రామానుజుని గణితం, చాణక్యుని అర్థశాస్త్రం.
ఇవ్వలేదా మన దేశం...?
By Nirati Gouthami

Comments