అమ్మ
By Dr. Samudrala Priskilla
అమ్మ పదం మధురం
అమ్మ తనం సుమధురం
అమ్మ మధురాతిమధురం
అమ్మ దైవం
అమ్మ మాట వేదం
ఈ మహికి మూలం అమ్మ
నా మదిని రూపం అమ్మ
రవి రాకకు ముందే లేస్తుంది
మనసును
కవి ఊహకు ముందే చూస్తుంది
రాత్రిని సైతం నిద్రబుచ్చుతుంది
కొంగు కంకణం బిగిస్తుంది
పనుల పందెరంగం జయిస్తుంది
మూతి తుడిచి ముద్దు పెట్టి
చేలాన్చాలమున దాచిన
రూపాయి పాపాయికిచ్చి
బడికి వాడిగా చేరుస్తుంది
నాన్న కన్నం పెట్టి
మన్నన కోసం తపిస్తుంది
అమ్మపోసే చన్నీళ్ళు
వద్దంటే పరిగెత్తే నాకాళ్ళు
దీనంగా చూసే అమ్మ కళ్ళు
వస్తానంటే...
నా కోసం దాటింది కస్టాల ముళ్ళు
అమ్మ చెక్కిళ్ళ పై కారే కన్నీళ్లు
ఆరునా కొన్నాళ్ళు
అమ్మ చెక్కిళ్ళ పై జారే కన్నీళ్లు
ఆగునా కొన్నాళ్ళు
విముక్తి కింకెన్నాళ్ళు
అమ్మ కన్నీరు తుడిచే నేస్తమెవరున్నారు
ద్రవించి పోయిన ఆ కొంగు తప్ప
సాయం సమయంలో
అమ్మ లోగిలి కౌగిళ్ళు
తల నిమిరే అమ్మ వ్రేళ్ళు
నా మనసు తొక్కే పరవళ్ళు
ఊరించే ఉవ్విళ్ళు
కాదు కొన్నాళ్ళు మూన్నాళ్ళు
ఉండాలి జీవితాంతపు రేన్నాళ్ళు
అమ్మంటే అనంత రూపం
అమ్ముంటే మనసు వికాసం
అమ్మున్తే మనసు ప్రకాశం
అమ్మంటే అందరి కోసం
కాదంటే అది వారి రాక్షసం..
By Dr. Samudrala Priskilla

Nice 👍
Mother love ❤️ 😘
Super
Excellent
Super