సీడా!!
- Hashtag Kalakar
- Dec 3, 2025
- 1 min read
By Dr. Samudrala Priskilla
సీడా!!
బాలికలతివల హక్కులబిల్లు
సియిడియేడబ్ల్యూ వెలదులవిల్లు
ఆసియా తొలిదిక్కుల మేరలు
థాయ్మలయా సింగపూరు
ఇండోనేషు మయన్మారులు
కన్నీటితో కొట్టుకొచ్చిన మున్నీరులు.
కన్వెన్షన్!!
విద్యోపాధుల కల్యత్వాలు
సామాజిక మన్నెరికాలు
రాజకీయార్ధిక చట్టరికాలు
అంచులోడి చేతిల్లో రంకులాడి బొమ్మలు
ఉలుకు లేని కుణపాల్లా
మణిపూర్ మంటల్లా
మావోల మరణాల్లా
ఉమ్మళించిన నేస్తరాల్లా
తాళుకున్న ఓర్పరికి ఘోషలఓలలు…
ఎలిమినేషన్!!
దేశం ఒక గేహశాల
దేహం మరో చెరసాల
దెబ్బలు కొట్టిన సుత్తులు
కొయ్యను చీల్చిన సీలలు
బిగించిన తలుపు రెక్కలు
నిలువుగా నరికిన తలపులు
ఆపరేషనుగదుల్లో పుట్టిన తీపులు
డిస్క్రిమినేషన్!!
లింగ వివక్షో శారీరక శిక్షో
మహిళ ఒక జీవచ్ఛవ భక్ష్యవతి
అక్రమ రవాణో లైంగిక మోషణో
మానవతి అల్లాడిన ఒక శూన్యవతి
భాగస్వామ్యమో బాధాస్వామ్యమో
సంస్కృతికి పరువిల్లిన స్త్రీ ఒక చిత్తర్వతి
కరుడుకట్టిన మేడ్రవాదికి
పితృస్వామ్యపు శూద్రవతి.
అగైనెస్ట్!!
ప్రతీ పురుషత్వాలు
చివరికి నిగ్రహగాళ్లె రక్షించే పోలీసోళ్లె
యాదికి వస్తె
వేటాడే సింహం కూడా బిడ్డను కన్న తల్లే
నూట తొంభై దిక్కుల సీడా శిక్షాస్మృతులే
ఉమెన్!!
లీలా చుడోరి, మెర్లిండా
బాబీస్, ప్రాబ్దాయూన్నితి
ప్రఫా,న్గుయెన్ ఫాన్ క్వేమైలు
కలమెత్తిన స్వరాల్లో
కాంక్షించిన కరలేవో
జాతికి మేల్కొలుపులు.
By Dr. Samudrala Priskilla

Nice 👍
Super
Good
Good
Good..