బద్ధకం
By Bharathi
తెల్లవారి అలారం మొగడంతోనే మనల్ని పలకరిస్తుంది.
నీతో సహవాసం చేస్తే పనులు ఎలా సాగేది,
అని చల్లనీళ్ళ చిలకరింపుతో సాగనంపాలని చూస్తే,
ఇంకా, వదలని మత్తుగా మన చెంతనే ఉంటుంది.
వెచ్చటి తేనీటితో విదిలించు కోవాలనుకున్న,
అన్ని పనుల్లో నేను ఉన్నానని మన వెంటపడుతుంది.
దీనికి భయపడి
చేస్తున్న పని పొరపడి
మరోసారి ఎక్కడ చేయవలసి వస్తుందో అని
ఒళ్ళుదగ్గరపెట్టుకొనిచేసేలాచేస్తుందిప్రతిపనిని.
By Bharathi

Comments