నువ్వు
By T.N.Nirmala Rani
నీరు పొంగిన కనులలోన
నీ రూపం వెలుగు నింపె
నవ్వులన్నీ మాయమైతే
నీ తలపే చిరునవ్వయ్యే
నిర్వేదం ఆవరిస్తే
నీ నవ్వే వెన్నుతట్టే
నా ఊపిరి ఆగిపోతే
నీ శ్వాసే ఆయువు పోసే
నా ఉనికి ఎక్కడంటే
నీవు నడిచే దారిలో
నా దగ్గర లేదే ఏ జాబిల్లి
నిన్ను తలిస్తే తరిలివచ్చే సినీ వాలి
వెన్న మనసున్న నువ్వు లేకున్నా
నీ నవ్వుల సంగీతం నడిపింది నన్ను.
By T.N.Nirmala Rani

Comments