తెలుగు పలుకుల మమతల వెలుగులు
By CA Lakshmi Supriya Sutapalli
తెలుగు భాషలోన ఉంది నిండుదనము
ప్రతి పలుకులోన ఉట్టిపడును హుందాతనము
మాతృభాష మాట్లాడుటకు యెన్నడూ చెందకు చిన్నతనం
చాటిచెబుతూనే ఉందాము తెలుగు భాష గొప్పతనం
తెలుసుకుందాము తెలుగు మహత్యాన్ని
ఎల్లపుడూ ఆస్వాదిద్దాము మన భాష సాహిత్యాన్ని
భావ వ్యక్తీకరణకు తోడవును తెలుగు మాధుర్యం
బహుచక్కగా వ్యక్తపరిచేందుకు మన ఆంతర్యం
పెంచుకుందాము మన భాషపై ఇష్టం
యే సందిగ్ధం లేకుండా చేద్దాము దాన్ని స్పష్టం
తెలుగు పలుకుటకు వేయొద్దు యెన్నడూ వెనకడుగు
మన భాష గౌరవాన్ని పెంచుటకు వేద్దాము ముందడుగు
By CA Lakshmi Supriya Sutapalli

Comments