top of page

కుటుంబ బంధాలు

Apr 28, 2023
2 min read

By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]


ఈ పద్య కావ్య రచన నా స్వంతము, దేనికీ అనుసరణా, అనుకరణా కాదు, ఎవఱినీ ఉద్దేశించినదీ కాదు, ఎక్కడకూ ప్రచురణకూ పరిశీలనకూ పంపబడలేదు. HashTag Kalakar పోటీల కొఱకు మాత్రమే వ్రాసినది.


నా వివరమ్ములు:


పేరు: ఇరువంటి (సోమరాజు) మాధురీ దేవి

కలముఁ పేరు: నాగిని

ఊరు: హైదరాబాదు

చరవాణి: 9963998955



జయము గూర్చు విద్య చదువందురు ధరలో

నహము దీసి జ్ఞానమందచేయు

శాస్త్ర పఠనమెపుడు సాగ వలయు గాని

తగవు మేలొసగదు జగతి నందు


నరుడి బ్రతుకు యేమి నయమైనదియు గాదు

ధరణి నందు నిౙము! తరచి చూడ

పరము పొందు వరము బహు సులభము కాదు

కరగి పోవు దోష కరములున్న


యనుచు చదువుచుండె యజమాని సూక్తులు

గృహమునందు జనుల నృపుడు నతడు

నీతి బోధ చేసి నిలబడునట్లుగ

చేయు బాధ్యతలను మోయువాడు


గ్రంథపఠనమాపి గమ్యము వైపుకు

పనులు మెదలు పెట్టె! కనులు తెరచి

యింటినంత చూచి యిల్లాలిపై దూకి

యరచి రచ్చ చేసె నాగ్రహమున.


కారణమ్ము లేదు యీ రణమ్మునకు యే

తప్పు లేదు చూడ తరుణి నందు

దర్పమొకటి చూప తగు మోహపడుచుండి

కేక వేసెనతను లేకిగాను



బుద్ధి చెప్పవలయు పుణ్య మూర్తి యతని

తల్లి రంకె పెంచి తగవులాడె

కోడలి మది పొడిచె క్రోధపు వాక్కులన్

యిట్టి చర్యలెపుడు యింట చూడ


వింత గాదు యైన పేర్మి మీర నతివ

పనులు చేసి మసలె భక్తిగాను

పతియు నత్తతోడ పంతము పూనక

సేవలంద చేసె చిత్తమలర


ప్రక్క యింటి లోన పతిపైకి తగువాడు

పడతి యొకరునుండె పాటు పడక

సోమరి గుణ శీల సోదితో గడుపుచు

నెసరు పెట్టుచుండె నెపుడు పనికి





యెవఱు మంచి వాఱు నెంచుట నందుకే

తగదు మనకు యిట్టి తలపు మదిన

భార్య బాధ పెట్టు భర్త పేరు సుబుద్ధి

పేరు నందె గలదు తీరు లేదు

నతని పత్ని విద్య యణకువ గలదిగా

పరిచయమయెను గాద పైన కథను

వారి సంతు లేమొ వారిజాక్షి వరుణ్

మెచ్చరెపుడు తండ్రి గిచ్చు విధము


పక్క యింటి లోన వనిత ప్రశాంతియు

పేరు కుదరలేదు వింత గాదు

నామె శిశువులేమొ నక్షర యక్షయు

తల్లి తీరు చూచి తల్లడిల్లె


చుట్టు లోకమంత చూడ గొప్పగ లేదు

యొకఱికొకఱి పైన యోర్వలేని

యీర్ష్య కుళ్ళు కుట్ర హేయమౌ ముసుగులు

పేర్మి బదులు నిలచె పెంకితనము


కష్ట సూఖములందు కలసి మెలసి పోక

పంతములను పట్టి సంత చేసి

లెక్క గట్టి తుదకు రిక్తమౌనట్లుగ

బంధములను వాఱు


రోజులిట్లు సాగె! లోపభూయిష్టమున్

శిశువులేమొ బడిని చేరిరంట

చదువులన్ని నేర్చి చక్కగ వృద్ధిని

పొంది నారు వాఱు అందముగను


పెరిగి పెద్దలవగ విద్యలు పూర్తయ్యె

కొలువు దొరికి తరలె క్రొత్త చోట

నపుడు తలపు మెదిలెనంట పెద్దలకేమొ

వాని పెండ్లి గూర్చి ప్రశ్న కదలె


రెండు యిండ్ల లోన లెక్క లేని తనను

బదులు వచ్చె నదియె వలదు పెళ్ళి

ననుచు పలికె వాఱు! నదియేల కుదరదే

యంటే దెలిపె వాఱి అభిమతమును


ఎవఱి యింట చూడ యెపుడునూ కొట్లాట

సామరస్యమసలు జాడ లేదు

ఒకఱికొకఱి పైన యోర్వలేని యసూయ

యేమి విలువ యింక యిలను చూడ


బంధమన్న యనుచు ప్రశ్నింౘ మొదలిడె

యెవఱికెవఱు పడరు యెందులోను

సర్దుకొనుటె గాని శాంతి సౌఖ్యములేవి

యని విరక్తి చెంది యలషి నాము


వద్దు యే కుటుంబ పద్దులింకను మాకు

మాదు బ్రతుకులిట్లు మసలనిండు

మమత లేని చోట మకిలి నటనలేల

నీతి లేని రీతి నిలువదిలను


యనగ వినిన జనుల కనులు తడిని పట్టె

పిల్లలెంత పడిరి వేదననుచు

మంచి చెడులు చెప్ప మాకు నర్హత యేది

యెటుల చెప్పవలయు హితము మేము


దారి చుపకుండ దమనుల వలె మేము

ధర్మ పథము తప్పి తప్పు చేసి

వీని మార్చి నాము హాని కలుగునట్లు

యనుచు వగచుచుండె మనసు నందు


వేఱు కాపురములు కోఱు వాఱిది కాదు

దోషమున్నదన్న దొరకని దొర

పెద్దవాఱి తరము వినయము పేరిట

పిల్లలేడ్చి యడిగె విడిగ బ్రతుకు


చూడ దోషులెవఱు జోడు వద్దనుటకు

ననుచు తప్పు దెలిసి యపుడు చెప్పి

పెద్దలంత కలిసి దిద్దుకొందుము మాదు

బుద్ధులనుచు కోరె సిద్ధతకును


గాని నమ్మ లేక గాదనె పిల్లలు

యొక్క సారిగాను యోర్మి రాదు

గాన మారబోము కళ్యాణము నికపై

తలువ బోము యనగ తల్లడిల్లె


కాని యేమి చేయ రాని వాఱయి యింక

మంచి రోజు కొఱకు మదిని దలిచి

యెదురు చూచుచుండె యేకమై యందఱున్

విధికి వదలి పెట్టి వెక్కి యేడ్చె



By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]




Recent Posts

See All
Mirrored Truth

By Rufaida Manzoor I stood beside the silent lake, With eyes that felt no urge to break. My hair fell low in shadows deep, The waters...

 
 
 
My Antidote

By Anveeksha Reddy You fill my books with your ink, seeping into the pages bright and brilliant The words etched into the cracks of it,...

 
 
 
Avarice

By Anveeksha Reddy You tear my skin and pick on my bones I label it as gluttony for you Churning and shattering the remains of my...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page