ఆ తేదీ
By Kruthika Mantha
తెల్లవారితే……
ఓ కొత్త తేదీ
ఆ తేదీ
-సంభ్రమాశ్చర్యాలను కలిగించవచ్చు
ఆ తేదీ
-వేకువ జామునే వేదన పలకరించవచ్చు
ఆ తేదీ
-వేయికనుల చెలికై ఎదురుచూపులకు తెర పడవచ్చు
ఆ తేదీ
-వందల ఉద్యోగం ప్రయత్నాలకు ముగింపు పలకవచ్చు
ఆ తేదీ
-జీవితాన కోలుకోలేని దెబ్బ తగలచ్చు
ఆ తేదీ
-జన్మకు తోడుండే బంధం దొరకనూవచ్చు
ఇవేవీ కాక
నేటిలాగే రేపూ గడవచ్చు
కొందరికి కేవలం తేదీ మారుతుంది
మరికొందరికి తేదీతో పాటు జీవితమూ మారుతుంది.
రేపు ఏమైనా రానీ, ఏమైనా కానీ!
కనురెప్పలను కలిపి
ఆలోచనలను ఆపి
ఈ నిద్రతో
రేపటి కొత్తదనానికి…
ఒక చిన్న తెరిపి!!!
By Kruthika Mantha

Comments