Write Up 4 రైతులు
By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]
కందములు
ఆకలి దీర్చెడి రైతుల
కేకలు వినుమో మనుజుల! కేళియు గాదే
యీ కలి నందున మనకై
వాకిలిలో పని సలిపెడి భఱలు వీఱే
పంటల కోసము యెండన
గంటల తరబడి నిలబడి కాపును రాకన్!
యింటను కష్టములున్నా
తంటాలను పడి జనులకు ధారను వోయున్
కష్టమ్ములకు ఫలితములు
నష్టము లైనను విడుఁవక నమ్ముచు నెలన్
యిష్టముగా వ్వయసాయము
పుష్టిగ చేయుచు నిలుపును బోనమ్ములనే
By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]

Comments