top of page

Write Up 3 విచక్షణ

May 4, 2023
2 min read

By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]


శ్రీ రఘురామ చారు తులసీదళదామా అని పాడుకుంటూ పనులు చేసుకుంటున్నాడు సుందరుడు.

ఇంతలో అతనికి ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది చిరాకు తెప్పించే విషయం అసలే ఆదివారం హాయిగా ఉందాము అనుకుంటే ఈ మేనేజర్ గడపడేమిటబ్బా అని చిరాకుపడ్డాడు సుందరం కానీ ఎప్పటిలాగే విచక్షణ అది కోల్పోకుండా, ఆయన చెప్పినది విన్నాక మౌనంగానే ఫోన్ కాల్ కట్ చేశాడు.

సుందర్ ఎప్పుడూ ఇంతే.

చాలా జాగ్రత్తగా పనిని మేనేజ్ చేస్తాడు ఇవాల్టి ఆవేశం కానీ అవస్థ గాని రేపటికి ఉండవు అని గట్టిగా నమ్ముతాడు అందుకని తొందరపడి ఎటువంటి గొడవకు పూనుకోడు. ఎంత ఇబ్బంది కలిగినా.

బాల్యం నుంచి ఇదే అలవాటు అతనికి దీనికి వేరే పెద్ద సూత్రం అంటూ ఏమీ లేదు పదేళ్ల వయసులో బడిలో ఇబ్బంది కలిగినప్పుడు అతనికి ఆ తర్వాత ఆరు నెలలకి

తాను అదే పరీక్షలు ఉత్తమశ్రేణిలో ఉత్తీర్ణుడవటం తెలుసు

అంటే భవిష్యత్తులో ఏం జరిగిందో తెలుసుకోగలుగుతున్నాడు

దీనికి పెద్ద తీరి ఏమీ అవసరం లేదు కాస్త విచక్షణ అంతే.

కష్టం కానీ సుఖం కానీ ఆనందం కానీ ఆవేదన కానీ ఇవాళ ఉన్నది రేపు ఉండదు ఈ బుధవారం పై బుధవారం ఒకటి కాదు కదా ఇవాళ రేపు ఒకటే వారానివైనా రెండు ఒకలా ఉండవు కదా ఈ కాస్త విచక్షణ ఉంటే ఎవరికీ ఏ సమస్య పట్ల బాధ ఇంత చింతన ఉండవు అంతా సంధ్యమనం పాటించగలుగుతారు స్థితప్రజ్ఞత స్థిరత్వం నిశ్చలత్వం అనేది సహజంగా వచ్చేస్తాయి కానీ ఈ కాస్త ఆలోచించకుని మనుషులంతా ఇంత సమస్యల్లో ఇంత మానసికపరమైన అవస్థల్లో కూరుకుపోతున్నారు ఈ సత్యాన్ని అతని చిన్న వయసులోనే చాలా తొందరగా గ్రహించడమే కాక దాన్ని బాగా ఆకళింపు చేసుకుని ఆచరణలో పెట్టి ఎప్పటికప్పుడు తనని తాను మెరుగుపరుచుకుంటున్నాడు

మరిచిపోకుండా దీనితోనే తన పయనం సాగిస్తున్నాడు అందుకు అతని కాస్త సంతోషంగా ఉండగలుగుతున్నాడు





ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ కోసం కాలేజీ సీట్లు కోసం వెతుకునే రోజులవి అందరూ ఎంతో ఆందోళన చెందుతున్నారు సహజంగానే కానీ మన సుందరం మాత్రం చాలా సున్నితంగా ఉండగలిగాడు అతని తల్లిదండ్రులకు కూడా అతని ఈ తత్వం ఈ ధోరణి అంతు పట్టలేదు


ఇక ఉండబట్ట లేక ఒకరోజు అతని బాబాయ్ అడిగారు అతనిది నువ్వు ఎలా ఇంత నిదానంగా ఉండగలుగుతున్నావు అని దానికి అతను అంతే నిశ్చలంగా సమాధానం చెప్పారు. ఏమీ లేదు బాబాయ్ ఇవాళ మనకున్న భయం రేపు ఉండకపోవచ్చు ఇవాళ ఉన్న వాన కానీ మబ్బు కానీ రేపు లేనట్టే ఇది కూడా అంతే ఎక్కడైనా ఒక చోట దొరకకపోదు ఏదో ఒక రకంగా జీవితం గడవకపోదు మనం ఎలా గడుపుకోవాలో ఆలోచించుకొని ప్రణాళిక బద్ధంగా సాగిపోవాలి కానీ ఇలా భయపడటం వల్ల ఉపయోగం లేదు కదా రేపు పొద్దుటి రోజున మనం వెనక్కి తిరిగి చూసుకుంటే క్రింద వారం దాకా జరిగిపోయిన రోజులన్నీ కూడా భయంతోనూ ఆందోళనలతో గడిచిపోవడం చూస్తే అది తెలివి తక్కువ తనం అనిపించుకుంటుంది కానీ ప్రణాళిక బద్ధం అనిపించుకోదు

అంటే ఆందోళన కన్నా ఆలోఏనా, ఆచరణ, అమలు ముఖ్యం అంతే కదా అని ముగించాడు చాలా స్థిమితంగా అతని బాబాయి అతన్ని గమనించి చాలా ఆశ్చర్యపోయాడు. ఇప్పుడే కాదు నాన్న ఎప్పటికీ నువ్వు ఇలాగే ఉండగలిగితే జీవితాన్ని గెలిచినట్టే జీవితంలో అందరికీ నువ్వు సాయపడగలుగుతావు అంటూ మనస్ఫూర్తిగా ఆనందిస్తూ ఆశీర్వదించారు.

అతను అప్పుడు ఇప్పుడు అలాగే ఉన్నాడు మనం ఈరోజు ఏ విషయం గురించి అయితే భయపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ ఉంటాము రేపు ఆ విషయం తప్పకుండా కరిగిపోతుంది అందుకే మనం ఆందోళనలతో ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటం ఏమాత్రం ఉపయోగం లేదు అని పదేపదే మననం చేసుకుంటూ ఉంటాడు ఆ మననాన్ని అతను తన

పయనంలో అడుగడుగునా ఉపయోగించుకోగలుగుతున్నాడు అందుకే ఇంత ప్రశాంతత

మఱి మనం కూడా ఇలాగే ఉందామా



By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]




Recent Posts

See All
Mirrored Truth

By Rufaida Manzoor I stood beside the silent lake, With eyes that felt no urge to break. My hair fell low in shadows deep, The waters...

 
 
 
My Antidote

By Anveeksha Reddy You fill my books with your ink, seeping into the pages bright and brilliant The words etched into the cracks of it,...

 
 
 
Avarice

By Anveeksha Reddy You tear my skin and pick on my bones I label it as gluttony for you Churning and shattering the remains of my...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page