Telugu Write Up 2 సైనికులు
By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]
మేదురదంత వృత్తము: 8 భ గణములు, యతి 5వ గణం ఆద్యక్షరం, సప్రాస
దేశము కోసమ ప్రాణములిచ్చెడి ధీరులు లెక్కను సేయరు నెన్నడు
శ్వాసను వీఱి కుటుంబపు బాధ్యత శాశ్వత రీతిన గైకొనుటే మన
యాశలు నిల్పెడి వాఱికి వందనమౌనుర యోజనులా భువి లోపలి
క్లేశములైనను దీర్పెడి వీరులు శ్రేష్ఠులకై నిలవండిక నిత్యము
కందము
ధన్యత దెల్పగలేమయ
నన్యపు చింతన యెఱుఁగక నందఱి కొఱకై
మాన్యులు మీ క్షేమము కై
సైన్యుల! దేవుని యడిగితి శ్వాశను! భక్తిన్
పర దేశీయులు రానీ
వరదలు గానీ వసుధన పంతము లైనన్
తరతమ భేదము లెఱుఁగక
నిరతము సేవలనొసగెడి నేతలు మీరే
By Eruvanti (Somaraju) Madhuri Devi [Nagini]

Comments