Seetharaamam
By Parvathi Chandrabhatla
అనగనగా ఓ అనాధ
ఎవరికీ పంచుకోలేని బాధ -
ప్రజల కోసమే చేస్తున్నాడు పోరాటం
చేరడానికి గుడిని కూడా లేదనే ఆరాటం.
ఆ యుద్ధంలో ఆమె కోసం రాముడు చేశాడు మహాభారతం
ఆమె మనసులో నిలచిపోయాడు నిరతం
ఈ సీత దొరకడం అతనికి ఓ వరం
చూసిన క్షణం మూగబోయింది మా రాముని స్వరం
ఆస్తి వదులుకుని అరణ్యం లోకి వేసిన అడుగు విలువ ఆరు వందల జీతం
అతని నీడలోనే ఆమె జీవితం
వేటాడి వస్తానన్న రాముడి రాక కోసం ఈ సీత లంకలో అరుపులకు దాటలేదు ఏ గీత
పసి ప్రాణం కోసం ప్రాణానికి దూరం అయి చేరాడు కారాగారం
అతని విశాల హృదయానికి ఇదే ఆధారం
జాడ తెలియని సీతకు సాయం చేసే మారుతి లేడు
వాళ్ళ ప్రేమను కలిపే వారధి లేదు.
స్వేచ్ఛ కోసం స్వార్థ పడి శ్వాస వీడలేదు ఒకరు దేశం కోసం ఆశయం కోసం ధ్యాస వీడలేదు ఒకరు
రాణివాసాన్ని వదిలి రణవాసాన్ని కోరిని మహాలక్ష్మి సీత
రాఘవుని కోసం ఆమె చేసిన ఎదురీత
మనసా వాచ కర్మణ ఆమెనే వెతికిన రామ వీరిది చిరకాలం చరిత్రలో నిలిచే ప్రేమ
వదలిన తోటలో వీరి యాత్ర ముగ్ధమందారం
కన్నీరు కురిపించిన వీరి పయనమే సీతారామం!!
By Parvathi Chandrabhatla

Comments