top of page

Prayaanam

Nov 4, 2022
1 min read

By Parvathi Chandrabhatla





పరవళ్ళెత్తుతున్న నా ప్రాణానికి ప్రతీ పరిచయం పరుగులు పెడుతున్న నాకు అదో పరవశం అడుగులు తడబడినా ఆగదు నా ప్రస్థానం.. నాతో నాకున్న నీడే నా సాయం

.అలలుగా అల్లుకున్న కలలకు తోరణం

నేను ధైర్యంగా వేసే ప్రతీ చరణం

అలసిన నా మనసుకు ఆకాశమే ఓదార్పు

సొలసిన నా శరీర నిప్పులకు నేల తల్లే నిట్టూర్పు

అలుపు లేని పిలుపులెన్నో విన్నా

మరువ లేని తలపులెన్నో కన్నా

కనుల ముందు కదలిన కథలు

ఎందరితోనో పంచుకున్న వ్యధలు

ఈ ప్రపంచ అందాలలో చిక్కుకుంది నా పయనం

ప్రకృతి పులకరింతలలో నొక్కుకుంది నా ప్రణయం

ఎటో దారి తెలీరుని నేను నడవగలనా ఈ తీరం వదిలి

దూరమెంతో తెలియని ఈ ప్రయాణంలో చేరుకోగలనా నాకై వేచి ఉన్న మజిలీ


By Parvathi Chandrabhatla




Recent Posts

See All
Mirrored Truth

By Rufaida Manzoor I stood beside the silent lake, With eyes that felt no urge to break. My hair fell low in shadows deep, The waters...

 
 
 
My Antidote

By Anveeksha Reddy You fill my books with your ink, seeping into the pages bright and brilliant The words etched into the cracks of it,...

 
 
 
Avarice

By Anveeksha Reddy You tear my skin and pick on my bones I label it as gluttony for you Churning and shattering the remains of my...

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page