Naa Kosam Nuvvu
By TN Nirmala Rani
నీ ముఖం వెలిగిపోతున్నదేమని మిత్రులంటే ఎందుకో తెలియలేదు.
నిన్నటి అమావాస్య చీకటిలో అందాల జాబిలి నాకెందుకగుపించిందెదుకో తట్టలేదు.
శతృ శ్లేషలు శూలాలై శోధిస్తున్నా నిబ్బరంలా కవచమైనదేదో కనబడలేదు.
ఊపిరి సలపని బాధ్యతలున్నా ఉల్లాసం ఉత్సవమైనదెందుకో ఊహకందలేదు.
వైరి కూటమి విషపు నవ్వులగుట్టు తెలిసినా చిరు నవ్వుల గలగలలెందుకో తోచలేదు.
తరచి తరచి చూస్తే తెలిసింది. తరంగానిపై తరలి వచ్చింది నీవని
By TN Nirmala Rani

Comments