Isn't a Moment Enough
Updated: Jul 29, 2025
By Pranay Sagar Anumalasetty
క్షణికావేశాలను కట్టడించనొక్క క్షణము చాలదా
క్షణికానందాలకోర్కెను విడువనొక్క క్షణము చాలదా
చెడును గ్రహించనొక్క క్షణము చాలదా
చెడు తలపులననుచనొక్క క్షణము చాలదా
స్వీయనియంత్రణకునొక్క క్షణము చాలదా
స్వీయచలనమునకునొక్క క్షణము చాలదా
మనిషిగా జీవింపదలచనొక్క క్షణము చాలదా
మనిషిలో మార్పునకునొక్క క్షణము చాలదా
*కానీ ఆ ఒక్క క్షణమును చేరుటకెన్ని క్షణములు చాలునో?
నిన్ను నువ్వు తెలుసుకున్ననాడు
నీపై నీకవగాహనున్ననాడు
నీయందున్న నిన్ను నీవే ప్రశ్నించిననాడు
ఆ ఒక్క క్షణమును చేరుకునే క్షణము సాక్షాత్కరించుటకునొక్క క్షణము చాలదా
Translation:
To control your momentary desires, isn't a moment enough?
To control your momentary rage, isn't a moment enough?
To identify negative things around you, isn't a moment enough?
To suppress the negative thoughts within you, isn't a moment enough?
For controlling your self, isn't a moment enough?
For motivating your self, isn't a moment enough?
To live with humanity, isn't a moment enough?
To change as a human, isn't a moment enough?
But how many moments are enough to reach that one moment?
If you know about yourself
If you have awareness about yourself
If you are questioning you within yourself
To witness that one moment to reach those moments, isn't a moment enough?
By Pranay Sagar Anumalasetty

Comments