Hrudayam
By Dr.T Naga Nirmala Rani
అంతు లేని సాగరం
అలల హోరు సంగీతం
పున్నమి నాడు జల తరంగం
నిశి రాత్రి నాడు
వన్నెలెరుగని వసంతం
విరుచుకు పడే విషాదం
జలరాశి అనంతం
జీవరాశి కి ఆధారం
వేల ఉప్పెనలు దాచి
కాలం కౌగిట చేర్చి
మేఘాల దోసిట ఒదిగి
సిరి వానల ఇల దిగి
ఆశల ఆరాటం
నిరాశల పోరాటం చేసే
మౌన విహంగం
అలుపెరుగని అవిశ్రాంత అంతరంగం
ఈ పోలిక నీదేనా ఓ హృదయం
By Dr.T Naga Nirmala Rani

Comments