Evaru Neevu
By T N Nirmala Rani
నీలిమమేఘాలలో నిండే నీ వెన్నెల
కరిగే సిరి చినుకుల
నను చేరే నీ చూపుల
విరబూసే పూవులా
జాబిలమ్మ నవ్వులా
పరుసవేది చందమో
పరిమళించు గంధమో
పల్లవించు నాదమో
ప్రవర ప్రణయ కావ్యమో
అంబరాన దాగిన
ముత్యమంటి మెరుపువో
సాగరాల అడుగున ప్రేమవో
అగ్ని శిఖర్ కాంతిలో
అరుణ కిరానా రేఖవో
కలలు నిజం చేసిన
కాలం అనే కలం నుంచి జాలువారిన అభిసారికవో
నాకు వెన్నెల పంచ వచ్చిన
యామిని సరస్వతివో
నను వీడి పోకుమా నేస్తమా
By T N Nirmala Rani

Comments