Abhivandana
By Parvathi Chandrabhatla
జగమేరుగని జంగమ మాయ జ్వరంలా జడిపించిన తరుణం...
ఆపదను అరికట్టడానికి అభయమిచ్చింది ఓ స్వాతి కిరణం.
శ్వాసకు దూరమయి నిరాశ కు చేరువ అవ్తున్న ఆ క్షణం...
ఆశలు కలిగించి అద్భుతాలు సృష్టించి దారుణం తో చేశారు రణం.
తీర్చుకొగలిగేది కాదు మీ రుణం.!
నెత్తురు ఏరులై పారుతున్టే
జీవితంలో చీకటి కమ్ముకుంటే
వెలుగు బాటలో నడిపించే మీ అడుగులు....
మృతి వైపు పరుగులు పెడుతున్న ప్రాణానికి నవీన ప్రయాణం నిర్దేశించే మీ చేతలు....
కలం పట్టి కదిలించే ప్రతీ కవి వర్ణించే అతులితమైన అందం ఆనందం...
ఆ అందమైన ఆనందాన్ని మా జీవనంలో నింపివేసే వైద్య బ్రిందనికి ఇదే నా అభివందనం!
By Parvathi Chandrabhatla

Comments