- hashtagkalakar
A New Beginning
By Karthik Vipparthi
ఈ అనురాగమే
అలవాటు లేనిదా ఇదివరకు
ఈ అనుసారమే
మరి దారి చూపదా పదములకు
ఈ మధుమాసమే
పదిలంగా ఉండదా తుదివరకు
ఈ ప్రియవాసమే
కొలువల్లే మారదా మనసులకు
ఈ బంధమే కలకాలమై
సాగాలి కాలాల అంచులవరకు
ఎపుడైనా తలచాయా
ఈ మాటలు.. మౌనంగా
జతముడి వేస్తామంటూ
ఎపుడైనా తెలిపాయి
ఈ ఊసులు.. ప్రాణంగా
ఇక నడిపిస్తామంటూ
ఏనాడెలా ఏ హాయిమేఘము
కురిపించెనో చినుకు చినుకు
ఈనాడిలా ఈ మోహమాటాము
చిగురించడం మొదటి అడుగు
ఏకాంతమే తెరదించగా
ముహూర్తమవుతోంది తీయని కథకు
మొదలేదో తుది ఏదో
తెలిసిన వారెవరు
ఈ అనాది పయనముకు
మలుపేదో గెలుపేదో
అడిగిన వారెవరు
ఈ ప్రియాతి తపనలకు
ఏమైందని.. సందేహమెందుకు
సగమవ్వగా అణువు అణువు
ఏం తోచని ఆలోచనేందుకు
ఒకటవ్వగా మనసు తనువు
ఆనందమే పరిభాషగా
స్వరాలుకలపాలి ఈ మధురిమకు
Is this affection something which is not habituated till now?
Will this belief show a way for these paths?
Will this spring remains forever?
Will this lovable emotion become the permanent residence of hearts?
This bond should become everlasting and should continue to the extremes of times
Did these words anytime thought in silence that they will tie the knots?
Did these moments say anytime that they will remain for a lifetine?
Don’t when a cloud of pleasure showered as drops
Today this shyness is a result of that
As the loneliness is parting away, auspicious time is arriving for a sweetest tale to start
Who knows what’s the beginning or what’s the ending for this never ending journey
Who asks about the victories or surprises in this heart-ful emotions
Why to doubt about what happened when every atom is sharing its half
Why to think too much when body and soul are united
Happiness a language, should join this melody
By Karthik Vipparthi