Women's Day
- hashtagkalakar
- Sep 6, 2023
- 2 min read
By Revanth
Happy women's day అమ్మ అని చెప్పా నేను. అమ్మ నవ్వింది.
"Women's day ఏంట్రా" అని అడిగింది. మీ ఆడవాళ్లు అందరికీ ప్రత్యేకంగా ఒక రోజు పెట్టారు అమ్మా. ఈరోజు చూడు, పేపర్లలో, టీవీలలో, మొత్తం మీ గురించే. మీ గొప్పతనం గురించే."
" అవునా. Thanks నాన్న " అంది అమ్మ.
సాయంత్రం కాలేజ్ నుండి ఇంటికి వచ్చాను. అమ్మ ఇంటి పనులు చేస్తూ ఉంది. నేను తన పక్కన కూర్చొని మాటా మంతి మొదలు పెట్టాను.
"అమ్మ, ఈరోజు కాలేజ్ లో మామూలుగా లేవు అమ్మ సెలబ్రేషన్స్. ఈరోజు అమ్మాయిలు అందరూ చీరలు కట్టుకొని వచ్చారు. కాలేజ్ మొత్తం మహాలక్ష్మిలతో నిండిపోయినట్టు కళకళలాడిపాయింది అనుకో. రకరకాల పోటీలు పెట్టారు. ఆఖరులో ఒక సభ పెట్టారు. ముఖ్య అతిథిగా మన జిల్లా కలెక్టర్ స్వరూప రాణి గారు వచ్చారు.
ఆడవాళ్లు అన్ని రంగాల్లో ఎలా దూసుకొని వెళ్తున్నారో, వాళ్ళని ప్రోత్సహిస్తే ఇంకెంత సాధించగలరో అని చెప్పారు. నిజమే అమ్మా, బయటకి వచ్చి మనుగడ సాగించాలి అంటే అమ్మాయిలు ఎంత కష్టపడాలి అసలు. Great అమ్మ మీరు."
అమ్మ రెండు నిమిషాలు మౌనంగా ఉంది.
"ఏంటమ్మా , నా మటుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను. నువ్వు ఉలకవు, పలకవు."
అమ్మ నోరు విప్పడం మొదలు పెట్టింది, "నువ్వు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం నాన్న. ఆడవాళ్లు బయట ప్రపంచంలో నెట్టుకురావడం చాలా కష్టం. మంచి విషయం ఏంటి అంటే వాళ్ళని కనీసం ఒక రోజు అయినా గుర్తిస్తున్నారు, గౌరవిస్తున్నారు.
ఇప్పుడు నా గురించి అంటే, నాలా ఇంట్లో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుదాం నాన్న. ఈరోజు పొద్దున్న వంట ఎవరు చేశారు నాన్న?
ఇంట్లో పనులు అన్నీ ఎవరు చేశారు నాన్న? రోజు లాగే ఈరోజు కూడా మీకు అన్నీ పనులు సక్రమంగా జరిగేటట్లు చూసింది ఎవరు నాన్న?"
" ఇంకెవరు అమ్మ, నువ్వే... నువ్వే చేశావ్. అయినా రోజు చేసేది కూడా నువ్వే కదా"
" అదే నాన్న. నేను కూడా అదే చెప్తున్నా. రోజు చేసేది మేమే, ఈరోజు కూడా చెయ్యాల్సింది మేమే. అయినా సరే మాకు గౌరవం, గుర్తింపు ఏమి ఉండవు. ఉద్యోగం అంటే బయటకి వెళ్లి చేసేది మాత్రమే కాదు. మేము చేసేది కూడా ఉద్యోగమే. కనీసం బయట ఉద్యోగాలలో పనులు వాయిదా వేయవచ్చు. అదే మా పనిలో అది కూడా కుదరదు. పొద్దున్న నుండీ సాయంత్రం వరకు మీకు కావాల్సినవి అన్ని అమరస్తు ఉండాలి. సెలవులు లేని సేవ మాది. జీతం లేని జాబ్ మాది. "
" అంటే ఇప్పుడు మీకు credit ఇవ్వాలి అంటావా! రోజు మిమ్మల్ని గుర్తించాలి అంటావా?" నాలో ఉన్న పురుష అహంకారం మాట్లాడింది.
"Yes! Correct నాన్న, Correct! You people don't give us enough credit. You people take us for granted.
అంటే ఇదంతా గుర్తింపు కోసం చేస్తున్నారా అంటే కాదు. అస్సలు కాదు. ప్రేమతో చేస్తాం. కానీ ఆ ప్రేమకు కొంచెం గుర్తింపు ఉంటే మరింత ప్రేమ ఇస్తాం నాన్న. రోజు మమ్మల్ని గుర్తించామని చెప్పట్లే నాన్న. మాతో పనులు చేయించుకోవడం మీ right లా feel అవుతారు. అది మేము మీ మీద చూపిస్తున్న ప్రేమ అని తెలుసుకోవాలి."
నేను మౌనంగా ఉండిపోయా.
"చివరగా ఒక మాట నాన్న. ఆడవాళ్ల కోసం ఒక రోజు పెట్టారు అని అన్నావు కదా. అసలు మేము లేకపోతే ఒక రోజు కాదు ఏ రోజు లేదు అని గుర్తుంచుకో."
By Revanth