top of page

Adigoo Vaadu - అదిగో వాడు

By Anurag Pathapally


అదిగోచూడు అదిగోచూడు

అక్కడే ఉన్నాడు వాడు

నిశ పొరల సమీక్షమై

నిరపరాదినని, నెత్తురు కక్కుతూ

విషపు కర్కాటకునిలాంటి కోరల

నాల్కను బయటికి తీస్తూ, ఏడుస్తూ, రోదిస్తూ

నిలవలేక పడిపోతున్నాడు చూడు

అదిగో అదిగో అటుకాడు

ఇటు చూడు, కుడి కాదు ఎడమవైపు

ఆ ఆ అక్కడే ఉన్నాడు వాడు

కంపట బుద్ధి కలిగి, కలి ప్రవేశించి

కలకాలాల నుండి మనల్ని వేదిస్తున్నాడు

మొర వినని మనిషి దొరని దోచే దొంగ

సైంధవ గుణచరుడు శకునికి గురువుడు

చూడు వాడిని సరిగ్గా చూడు వాడిని

కుళ్ళిపోయిన కంటిగుడ్డు నుండి రుధిరజ్వాల కారుతున్నా

లంపట బుద్ధిని ప్రయోగిస్తూ

కపట నాటకాలు ప్రదర్శిస్తున్నాడు

నిజానికి వాడికి రూపం లేదు దేహం లేదు

మన భూమికి అతిథి వాడు

మనల్నే శాసిస్తున్నాడు

నీవు జనియించిన జన్మదినమున

నిన్నెత్తుకు ముద్దాడిన నీ తండ్రి

చేతికున్న కనకంగుష్టం లోనుంచి నిన్ను చేరాడు వాడు

దొంగ వాడు, దూరినట్టు తెలపడాడు

స్వచ్ఛమైన నీ చిన్ని హృదయాన్ని

విచ్చల విడిగా దోచేశాడు

నవ్వు మాత్రమే ఎరిగిన నిన్ను

రోదన దారులపై రథ యాత్రలు చేయించాడు

మన అనే నీ మంచి గుణములోంచి

మ అక్షరము తుంచేసిన దుష్టుడువీడు

ఆనంద సమేతమైన నీ హృదయాంతర్గతల్లో

కామ క్రోధ కోటలు కట్టి వాటికి

అహంకార గోడలు అడ్డు పెట్టాడు

సర్వ సమయ సత్వవైన నిన్ను

ఈ దిగంబర నేత్రాలకి కానరాకుండా

రజస్తమో తాళ్లతో కట్టిపడేశాడు

కానీ… నేడు…

నువ్వు మారావు

అక్ష విద్య నేర్చిన నలుడి వయ్యావు

అందుకే చూడు చూడు వాడిని

కపట లంపట ధారి దుర్ముఖుడిని

నిన్ను వదిలిన ఆ ఖలుడిని

అదిగో అదిగో వాడిని చూడు

ఇక్కడ అక్కడ ఎక్కడో కాదు

దుర్గతి పొందిన వాడి దేహాన్ని

కాలిపోతున్న కరములతో పట్టి పారిపోతున్నాడు

వాడే వాడే అదిగో వాడే….


By Anurag Pathapally


Recent Posts

See All
Dumb or In Love

By Kavya Mehulkumar Mehta are poets dumb — or just in love? to the world, they may seem dumb, but for them, love is inevitable. poems are reminders of love that can’t be forgotten, shan’t be forgotten

 
 
 
A Future So Azure

By Inayah Fathima Faeez Tomorrow looms unsure, muffled by the deep Thumbs twiddling, barriers never-ending, failure and nothing to reap At the shore lie the choices, imposing, leading to journeys impo

 
 
 
Letting Go In Layers

By Inayah Fathima Faeez Some part of us is cold and shrivelled, In a body of seemingly endless depth. Some part of us is heavy and dishevelled, Misery filling an unending breadth. Some part of us is

 
 
 

56 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Powerful and thought-provoking poem. The imagery is intense, and the journey from inner darkness to awareness is beautifully conveyed. Truly gripping and impactful.

Like

excellent work and great usage of words

Like

6012Mani Teja
6012Mani Teja
Dec 15, 2025
Rated 5 out of 5 stars.

Great writing brother 👏🏾

Like

Satya
Satya
Dec 15, 2025
Rated 5 out of 5 stars.

Excellent poem anna✨🤌

Like

Chakri
Chakri
Dec 11, 2025
Rated 4 out of 5 stars.

Great poem Anna 👌

Like
bottom of page