- hashtagkalakar
టీ
By Srinivas Putta
నిన్నటి నిశీధి నిదురలో
నను వదలక తరిమిన
ఎన్నెన్నో ఊహాలని
వడిసిపట్టాను వలవేసి..
ఉదయాన్నే వాటిని,
గోరువెచ్చని పదాలుచేసి.
ఎద పాత్రలోకి పోసి.
అనుభవాల పొడిని వేసి.
మనసులో రగిలే బాధలతో మరగకాసి.
వొలకబోసా నే”టి” కప్పులోకి
కొంచెంకొంచెంగా పారబొసా
గతాలను గొంతులోకి.
బరువుగా కదలసాగా
బాధ్యతల భవిష్యత్తులోకి..
By Srinivas Putta