- hashtagkalakar
ఆశ
By Dr.T Naga Nirmala Rani
నిశీధి అంటే నలుపు కాదు
కోటి తారల దుప్పటి
మౌనమంటే ఓటమేనా
గెలుపు ముందటి పున్నమి
కఠోర సత్యం చేదు కాదు
తట్టి లేపే జాగృతి
వేసవంటే వేడిమేనా
మల్లె జాజుల వాకిలి
సింధువంటే ఉప్పెనంటే
వర్ష మేఘపు జాడలేవి
పంకమంటూ వంక పెడితే
పంకజమ్ముల పల్లెవేది
క్రీనీడల వెన్నెలేగా
చంటి పాపల నవ్వుల జావళి
వేదనంటే కనుల నీరా
ముందు ముందు నవ్వులిచ్చేనెచ్చెలి
ఆశ అంటే కాదు కలల ఎండమావి
నిలువెల్లా ధైర్యం నింపే నమ్మకాల ఊటబావి....
By Dr.T Naga Nirmala Rani