- hashtagkalakar
వలస
By Srinivas Putta
రెక్కలొచ్చాయని కొత్తగా
ఎగురుతూ వెళ్ళావా ఓ రామచిలుక!
కనిపెంచిన వాళ్ళని వదిలేసి వెనక.
ఎంత మురిసిందో తల్లి నిన్నే కన్నాక.
అంతకు మించి ఏడ్చింది నువు కానరాక.
ఎదురైన ప్రతిసారి నీలాంటి పోలిక.
మా మనసు ఉరికేను వదలక తన వెనక.
వచ్చిపోవడానికి లేదంటూ తీరిక.
అడగకోయి మమ్ములని రమ్మంటూ అందాక.
మా మధుర స్మృతులన్ని ఉన్నాయి గనక.
సాగని మమ్ములను ఇక్కడే కడదాక.
By Srinivas Putta