top of page

ఆడది...

By Dr. Samudrala Priskilla


అందరి హృదయాల్లో ఆతురత... 

పుట్టింది ఆడబిడ్డ... 


తండ్రి తల పట్టుకొని 

కొడుకైతే బాగుండేదంటూ 

తువ్వాలు భుజాన వేసుకొని వెళ్ళిపోయాడు..

నవమాసాలు మోశాను

అమ్మాయి అని తెలిస్తే 

అప్పుడే 

అబార్షన్ చేయించుకునే దాన్నంటూ 

కడుపు కొట్టుకుంది ఆ తల్లి..

ఏదో ఒకటి ఆడితే మగైతే అంటూ 

పురిటి బిడ్డనెత్తుకుంది నానమ్మ..


ఆడపిల్లవంటూ వెట్టి చాకిరి చేయిస్తుంది తల్లి 

కొడుకును మాత్రం 

చదవాలంటూ డబ్బు జేబులో పెడుతుంది.. 

ఆడపిల్లవి ఈడ పిల్లవి కాదంటూ తండ్రి 

పెళ్ళిచేసి పీడాకారం వదిలించుకుంటానంటాడు..

ఆడ పిల్లవంటూ తాత 

నాలుగు గోడల లోపల బందీవంటాడు..

ఆడపిల్ల వంటూ అన్న

ఆస్తంతా తనదే నంటాడు..


ఆడపిల్ల బైటికి అడుగు పెడితే.....

ఓ రౌడీ కళ్ళు ఎగరేస్తాడు

ఓ దేశముదురు చెయ్యెత్తుతాడు

ఓ పోకిరి అంటుకోవాలని చూస్తాడు


ఆడదాని జీవితం 

అరిటాకుతో సమానమంటూ సమాజం

ఆడది బందీ అంటూ శాస్త్రం 

ఆడది అబల అంటూ సిద్ధాంతం ..


చిన్నతనంలో తండ్రికి బందీ 

మధ్య వయసులో మొగుడికి బందీ

వృద్ధాప్యంలో కొడుకుకి బందీ 

వీరికి తల వంచితే బందీ

ఎదురు తిరిగితే ఖైదీ..


“ఆడదిగా పుట్టుట అంత శాపమా?”

ఆడదాన్నే అడుగుతున్నా !

ఇది ఆధునిక యుగమనీ – ఆడా మగా తేడా లేదనీ 

ప్రతి ఒక్కరూ..

గుండె మీద  చేయి వేసుకు చెప్పండీ!!!

ఇది కాదొక కవిత్వం- ఆడదాని మనస్తత్వం.


[గుంటూరు జిల్లాలో తెలగాయ పాలెంలో  అన్నాతమ్ముల మధ్యన పుట్టి, తల్లి తండ్రి ప్రేమకు నోచుకో క, ప్రేమ పంచుతానన్న సన్నిహితుడి మోసం తట్టుకోలేక, చనిపోతూ “ఆడదిగా పుట్టడం అంత శాపమా?” అని లెటర్ లో రాసి చనిపోయిన తన ఆవేదనకు,  మృత్యుప్రశ్నకు సాక్షిగా ఈ కవిత]


By Dr. Samudrala Priskilla


Recent Posts

See All
Dumb or In Love

By Kavya Mehulkumar Mehta are poets dumb — or just in love? to the world, they may seem dumb, but for them, love is inevitable. poems are reminders of love that can’t be forgotten, shan’t be forgotten

 
 
 
A Future So Azure

By Inayah Fathima Faeez Tomorrow looms unsure, muffled by the deep Thumbs twiddling, barriers never-ending, failure and nothing to reap At the shore lie the choices, imposing, leading to journeys impo

 
 
 
Letting Go In Layers

By Inayah Fathima Faeez Some part of us is cold and shrivelled, In a body of seemingly endless depth. Some part of us is heavy and dishevelled, Misery filling an unending breadth. Some part of us is

 
 
 

82 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Shashanth Punem
Shashanth Punem
Dec 30, 2025
Rated 5 out of 5 stars.

Good

Like

Shashanth Punem
Shashanth Punem
Dec 30, 2025
Rated 5 out of 5 stars.

Super

Like

Rated 5 out of 5 stars.

Nice 👍

Like

Steven
Steven
Dec 30, 2025
Rated 5 out of 5 stars.

Good

Like

Rated 5 out of 5 stars.

Very good

Like
bottom of page