మది మరుపు
- hashtagkalakar
- Dec 25, 2023
- 1 min read
By Hemanth Kartheek
మర్చిపోడానికి మనిషిగా ప్రయత్నించేంత
జ్ఞాపకం నువ్వు
మర్చిపోవాలనే మాటకు చచ్చిపోవాలనిపించేంత
ప్రళయం నువ్వు
మర్చిపోలేననే బాధకు మతిపోగేట్టేంత
విషం నువ్వు
మర్చిపోడానికి వీల్లేకుండా మతిపై మది చిమ్మిన
అమృతం నువ్వు.
నా మౌనం దాచిన అబద్దాలకు
యీ శతాబ్దపు అర్థం నువ్వు
నా ప్రాణం దోచిన అనుబంధాలకు
యీ దశాబ్దపు స్వార్థం నువ్వు.
నా గుండె చేసే శబ్దాన్ని ...
సంగీతంలా మార్చే రాగం నువ్వు.
నా కళ్ళు కార్చే కన్నీటిని...
సముద్రం చేసే రహస్యం నువ్వు.
నన్ను కన్నీరులా మార్చిన కన్నులు నువ్వు
నా కన్నీరును తీయగా చేసిన తేనెటీగ నువ్వు
నా కలలను అలల్లా తరిమిన ఉప్పెన నువ్వు
నా ఆశాల్ని శ్వాసలుగా మలుచుకున్న మాయ నువ్వు.
మనిషి కనులకు ఆశవి నువ్వు,
మనసు పనులకు భాషవి నువ్వు.
ధ్యాసను దాసిని చేసే వ్యసనం నువ్వు,
శ్వాసను శక్తిలా శాసించే శాసనం నువ్వు.
By Hemanth Kartheek