top of page

పసిమొగ్గ

By Dr. Samudrala Priskilla


పుట్టి ఆరునెలలు 

పురిటి గంధమైనా పోయిందో లేదో

అమ్మ ఆశలకు హరివిల్లు 

నాన్నరికానికి పొదరిల్లు 

పాలారని ఆ పసిమొగ్గ

వెన్నలారని నా పసిమొగ్గ


పక్కింటి భవాన్జీకిచ్చి 

కార్యక్రమాన్ని మెచ్చి 

ఆధ్యాత్మికమంటూ ఆ దంపతలు

నమ్మకంగా నడిచి వెళ్ళారు


మూడు పదుల వయసు 

కామంతో నిండిన వాడి మనసు 

అంతే 

అమ్మతోడు


నమ్ముతావా! నా దేశమా!

నా చిట్టి తల్లిని 

చిదిమేస్తుంటే

నా ఊరితనం గోడ్డుబోయింది


అన్నేమా ! పున్నెమా! 

అభమా! సుభమా!

మంచా ! చెడ్డా!


పంచభూతాలూ 

ఏమీ ఎరగనట్టు

ఏవేవో చేసుకుంటూ 

కాలంతో పరిగెత్తుతున్నాయి.


దేశమా ?

తాళి తెంచే బంధుత్వానికి 

కామించే అంధత్వానికి 

మనసా? వయసా?


దేశమా ?

నీకిది గుండె కాటు

బుల్లెట్ తూటు


ఈనాడు వాడు కాముకుడు 

ఎన్నడైనా వాడు వేశ్యకుడు

ఔనన్నా కాదన్నా 

వాడు నీ గుండెని చీల్చిన వాడు. 

[గుజరాత్ రాష్ట్రం లోని పఠాన్ జిల్లా భనాస్మా తాలూకా ఇటోడా గ్రామం,, మంగళవారం రాత్రి భావాన్ జీ ఠాగూర్ [32] వల్ల 6నెలల పసిపాప అత్యాచారంకి గురైంది. పసిపాప ఏడుపు సాక్షిగా ఈ కవిత]


By Dr. Samudrala Priskilla


Recent Posts

See All
एक विचारू

By Mohini C. Halarnkar विठुराया एक विचारू      सांगशील का मला ? युगान युगे उभा आहेस   वेदना नाही होत तुझ्या पायाला? कटेवरचे हात          खाली घेतच नाहीस विराम म्हणून पण         थोडा बसतही नाहीस l राज्

 
 
 
पाठीशी

By Mohini C Halarnkar स्वामी माझे असता पाठीशी  तमा मला कशाची ? हवे तुम्हा ते गेलात घेऊन  कशी दाखवू घालमेल मनाची ? खडतर माझा प्रवास आता परी हाक तुम्हा मारिते l तुम्हीच म्हणता स्वामी समर्था विधीलिखितात

 
 
 
ती येते रोज

By Mohini C. Halarnkar साांज माझी वेगळी ग कवाडातून खुणावते मजला l मी म्हणते मग थाांब जराशी दिवा लावते ग िेवाला l दिवा मग मी लावते पटकन ती हसते मला बघून खुिकन l आवरा आवर माझी बघते िडून म्हणते ये ना ग आ

 
 
 

72 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Bhavani Battula
Bhavani Battula
2 days ago
Rated 5 out of 5 stars.

Super

Like

Rated 5 out of 5 stars.

మౌనం నా మనసులో మౌనంగా.....

Like

Bhavani Battula
Bhavani Battula
2 days ago
Rated 5 out of 5 stars.

It's great

Like

Rated 3 out of 5 stars.

Superr

Like

Naga Bhushanam
Naga Bhushanam
3 days ago
Rated 5 out of 5 stars.

wonderful

Like
bottom of page