నిద్ర పొలి…
- Hashtag Kalakar
- 6 days ago
- 1 min read
By Dr. Samudrala Priskilla
ఆగి ఆగి సాగిన అడుగో
సాగి మూగిన ముసురడుగో
మూగి మూగి రేగిన తలపో
రేగి రేగి చల్లారని కణికో
జీవనయానం ఒక అచ్చుటిప్పణి....
చల్లారి ఆరని నివురో
రణమో మరణ శయ్యమో
జీవన యానం ఒక గుప్తకేళి....
రక్తాశ్రువులు చిందించీ స్మితాశ్రువులు కనిపించీ కవితాశ్రువులు వినిపించీ
జీవనయానం ఒక పాచికపాళీ…
నీలువారినకళ్ళు…సెలయేళ్ళు…
హృల్లోగిళ్ళ ముంగిళ్ళు…అఖాతాలు…
గుండెలమాటున దాగిన లావాలు
కడుపు మంటలు కరగని కొండలు
మిగలని విలువలు… చెరగని ముద్రలు…
నెరవేరని ఆశా దీపాలు… కటిక పత్యాలు…
జీవనయానం నేడొక నెన్నెరులకాణెలి
కాలధర్మాన మున్ముందుకు సాగే నిద్రపొలి….
డా.సముద్రాల ప్రిస్కిల్ల, తెలుగు శాఖ
ప్రభుత్వ కళాశాల (అ), రాజమహేంద్రవరం
By Dr. Samudrala Priskilla

Comments