ఓ చెలీ !
- Hashtag Kalakar
- Nov 29
- 1 min read
By Charitha Nakkina
ఓ చెలీ !
ఝం అని జాలువారే జలపాతాన్ని తలపించే నీ కురులు
కరగని శిలనైనా కవ్వించే ఆ కనులు
దివి నుంచి భువికి వేసిన వంతెన లాంటి నభము
మతిపోగొట్టే మనోహరమైన ఆ అధరము
తేనె వలె పలుకులొలికే ఓ చిలకా!
మాట విడువని ఈ మౌనవ్రతమేల?
ఆ శశికే శరము కలిగే మోము దాచనేల?
ఓ చెలీ !
ఒడిసిపడితే చేజారిపోయేంత కటిపై
ఒడుపుగా కడవనే పెట్టి నడుస్తుంటివే
ఘల్లుమనే ఆ గజ్జెల సవ్వడి
తుళ్లుమని నా గుండెలో ప్రతిధ్వనించదా !
నీ ఓర చూపుకే ఒరిగిపోనా!
ఆ నోట మాటకె మురిసిపోనా !
నా చెలీ !
నీ ఎదమాటున దాగిన ప్రేమకే
నా హృదయ తారవైన నీకే దాసుడిని కానా !
ఎదురుచూపు వీడగలనా !
By Charitha Nakkina

Heart touching 💚
Beautifully written!!! So talented man!!
Insanely beautiful!! You're soo talented broo!!
Pure and beautiful felt every line❤️
Nice