By Vutukuri Reethika
అమ్మ అను రెండు అక్షరాలెనమ్మ
కానీ వాటిని నాతో పిలిపించుకోవడానికమ్మ
నువ్వు పడిన వేదన అంత ఇంత కానే కాదమ్మా నువ్వు నాకోసమని నీ ఇష్టాలనే మార్చుకున్నావమ్మ
నువ్వు నన్ను పుట్టక ముందే చూసేశావు గా నీ మసపులోనే అమ్మ
మొదట నేను ఈ భూమి మీదకు రాగానే నా ఏడుపువిని ఎంతో ఆనందించావమ్మ
అప్పుడే నీ మనస్సులో నేను మళ్ళీ ఎప్పుడు బాధపడకుండ ఉండే లాగ అమ్మ
నీ కంటి పాపలాగా నన్ను చూసుకుందామని అనుకున్నవమ్మ
నేను నీకడుపులో ఉన్నప్పుడు నేను తంటుంటే అమ్మ
అది నేను పెట్టే ముద్దులు అని నాన్నకు చెప్పుకొని ఎంతో ఆనందించావమ్మ
నేను నీ శరిరానికి గాయం చేసి పుట్టాను అమ్మ కానీ వన్ను నీ గుండెల్లోనే పెట్టుకొని చూసుకునేదానివమ్మ
నేను ఎప్పుడైనా నామాటలకత్తితో నీ మనస్సును కోసి ఉంటే క్షేమించమ్మ
నేను చిన్నప్పుడు తప్పటడుగులు వేస్తున్నప్పుడు అమ్మ
నువ్వు నా నీడలాగ నన్ను పెండించే దానివమ్మ ఒకవేళ ఎక్కడైన నేను గడపలు తట్టుకోని పడిపోతానేమోనమ్మ
నేను నిన్ను మొదటిసారి అమ్మ అని పిలిచినప్పుడు
నీ తొమ్మిది నెలల కష్టానికి ఫలతం ఎంతో తీపిగా ఉందని సంతోషించావమ్మ
ఎప్పుడైనా నేను తప్పు చేస్తే నన్ను తిట్టెదానివమ్మ అప్పుడు నాకు తెలిసేది కాదమ్మ
నా మీద ఉన్న ప్రేమతో అలాచేసేదానినవమ్మ్మ కానీ నేను అది తెలుసుకోకుండా నీ మీద కోపం తెచ్చుకునేదానినమ్మ
తరువాత తెలిసింది నువ్వు నాన్నతో చెప్పుకొని బాధపడేదానివమ్మ
నన్ను నీ కళ్ళల్లో పెట్టుకొని చుసుకునే దానివమ్మ్మ నేను ప్రతి పోటిల్లో విజయం సాధించడానికి నా కష్టాం కాదమ్మా
కేవలం నీ ప్రోత్సాహం అలాగే నాన్న ధైర్యం మాత్రమే అమ్మ
ఆ రెండు లేకుండా నేను పాల్గొనే దానినే కాదమ్మ నాకు ఆ రెండు నా జీవితాంతం కావలమ్మ
అవి లేకుండా నేను నా జీవితాన్ని ఉహించుకోలేనమ్మ
వాటిని మీరు ఎప్పటికి అందిస్తారని ఆశిస్తున్నామ్మ
దేవుడికి ఇంతమంచి అమ్మ నాన్నలు నాకు ఇచ్చినందుకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలయటంలేదమ్మ
మీరిద్దరి రణరం ఎలా తీర్చుకోవాలో తెలియటంలేదమ్మ
కానీ మిమ్మల్ని సమాజంలో తలెత్తి తిరేగే విధంగా చేస్తానని మాట ఇస్తున్నాను అమ్మ
మళ్ళీ వచ్చె జన్మ అంటు ఉంటే, మళ్ళీ నీకూతురిగా పుట్టి అమ్మ నీ రుణం తీర్చుకోవాలని ఉందమమ్మ
కానీ వద్దమ్మ ......
మళ్ళీ వచ్చే జన్మలో నన్ను కనడానికి ఆ బాధ నీకు వద్దమ్మ
ఆ సృష్టి కర్త అయినా బ్రహ్మదేవుడిని ప్రార్ధించి నిన్ను నాకు కూతురుగా పుట్టించి నీ రుణం తీర్చుకోవాలని ఉందమ్మ
ఈ జన్మలో నాకు తల్లిదండ్రులుగా మిమ్మల్ని సృష్టించినందుకు ఆ దేవుడికి చాలా కృతజ్ఞతలు అమ్మ
మళ్ళీ వచ్చే జన్మలో ఇంత మంచి అమ్మానాన్నలను నాకు మళ్ళీ ఇవ్వమని నేను దేవుడిని ప్రార్ధిస్తూన్నమ్మ
By Vutukuri Reethika
🤧🥺
✨
Nice
Super
fantastic poetry